బాలకృష్ణ(Balakrishna), ఎన్టీఆర్(NTR), కళ్యాణ్ రామ్(Kalyan Ram) ఇప్పుడు వరుసగా విజయాలు సాధించారు. `అఖండ`(Akhanda)తో బాలయ్య, `ఆర్‌ఆర్‌ఆర్`(RRR)తో ఎన్టీఆర్, `బింబిసార`(Bimbisara)తో కళ్యాణ్ రామ్ విజయాలు అందుకున్నారు. ఎన్టీఆర్ మినహాయిస్తే బాలయ్య, కళ్యాణ్ రామ్ వరుస పరాజయాల అనంతరం విజయాలు సాధించి ఫామ్‌లోకి వచ్చారు. నందమూరి ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఇదిలా ఉంటే ఈ ముగ్గురి హీరోల సినిమాలకు సేమ్ కనెక్షన్ ఉంది. యాదృశ్చికంగా ఈ ముగ్గురి హీరోలను కాపాడింది ఒకే ఎలిమెంట్ కావడం విశేషం. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమవుతుంది.