జడ్జి శ్రద్దా దాస్ కోసం సెట్ లో గొడవకు దిగిన హైపర్ ఆది, బిగ్ బాస్ రవి కృష్ణ... తలకాయలు లేచిపోతాయంటూ 

Published : Aug 04, 2022, 07:13 AM IST

డాన్స్ రియాలిటీ షో ఢీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జడ్జి శ్రద్దా దాస్ కోసం హైపర్ ఆది, రవి కృష్ణ గొడవకు దిగారు. వీరి వ్యవహారం చూసి శ్రద్దా దాస్ తో పాటు సెట్ లో ఉన్నవారంతా కంగు తిన్నారు.   

PREV
16
జడ్జి శ్రద్దా దాస్ కోసం సెట్ లో గొడవకు దిగిన హైపర్ ఆది, బిగ్ బాస్ రవి కృష్ణ... తలకాయలు లేచిపోతాయంటూ 
Dhee Show


ఢీ సీజన్ 14లో చాలా మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఈ షోకి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, పూర్ణ, దీపికా పిల్లి వెళ్లిపోవడం జరిగింది. ఢీ 13లో అలరించిన ఈ టీం 14కి లేకుండా పోయారు. ముఖ్యంగా జడ్జి పూర్ణ చర్యలు ఆసక్తిరేపుతూ ఉండేవి. కంటెస్టెంట్స్ కి ఆమె మొహమాటం లేకుండా ముద్దులు, హగ్గులు ఇచ్చేస్తూ ఉండేవారు. 

26
Dhee Show


ఇక లేటెస్ట్ సీజన్లో ఆ బాధ్యత హీరోయిన్ శ్రద్దా దాస్ తీసుకున్నారు. ఆమె కూడా ఈ విషయంలో అసలు తగ్గడం లేదు. యాంకర్స్, కంటెస్టెంట్స్ అడిగిందే తడవుగా ముద్దులు, కౌగిలింతలు ఇచ్చేస్తుంది. ఇక తాజా ఎపిసోడ్ లో యాంకర్ ఆది శ్రద్దా దాస్ ని ముద్దు కావాలని అడిగాడు. 
 

36
Dhee Show


దానికి శ్రద్దా ముద్దు కాదు కానీ ఒక హగ్ ఇస్తానన్నారు. ఏదో ఒకటి ఇచ్చేయండి అంటూ ఆది ఆమె దగ్గరకు వెళతాడు. ఈ మధ్యలో సీరియల్ హీరో రవికృష్ణ కలగజేసుకుంటాడు. నాకు కూడా శ్రద్దా హగ్ ఇవ్వాలంటూ హైపర్ ఆదితో పోటీకి దిగుతాడు. దానితో హైపర్ ఆది సీరియస్ అవుతాడు. ఈ విషయంలో తగ్గేది లేదు. తలకాయలు లేచిపోతాయంటూ సీరియస్ కామెంట్స్ చేస్తాడు. 

46
Dhee Show


ఇక శ్రద్దా దాస్ హగ్ కోసం పోటీపడుతున్న రవికృష్ణ తీరుపై నవ్య స్వామి అసహనం వ్యక్తం చేసింది. నువ్వు మరీ ఇలా తయారయ్యావు ఏంటి? అంటూ ప్రశ్నించారు. లేటెస్ట్ ఎపిసోడ్ లో జరిగిన ఈ సంఘటన ఆసక్తి రేపుతోంది. ఐతే ఇదంతా హైప్ కోసమే. రవికృష్ణ, హైపర్ ఆది సరదాగా అలా గొడవపడ్డారు. 

56
Dhee Show


ఇక ఢీ షోలో ప్రియమణి కూడా కనిపించడం లేదు. జడ్జెస్ గా గణేష్ మాస్టర్, నందిత శ్వేతా, శ్రద్దా దాస్ వ్యవహరిస్తున్నారు. యాంకర్స్ గా హైపర్ ఆది, ప్రదీప్ ఉంటున్నారు. రష్మీ సుడిగాలి సుధీర్ వెళ్ళిపోయాక షో కొంచెం డల్ అయ్యింది. వారి స్థానంలో రవి కృష్ణ, నవ్య స్వామిని, అఖిల్ ని దింపారు. 

66
Dhee Show

గతంతో పోల్చుకుంటే ఆ స్థాయిలో టీఆర్పీ రావడం లేదు. అయితే ఇప్పటికీ మంచి ఆదరణ కలిగిన షోగా ఢీ ఉంది. ఇక మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఢీ, జబర్దస్త్ చాలా కాలం పాటు తిరుగులేని టీఆర్పీతో దూసుకుపోయాయి. స్టార్స్ దూరం కావడం వలన కొంచెం నెమ్మదించాయి.

Read more Photos on
click me!

Recommended Stories