ఇంతలో మీరే చేశారు అంటుంది శృతి. నేను హెల్ప్ చేస్తాను కానీ కొన్ని కండిషన్స్.. నేను ఆఫీస్ కి రాలేను, మంత్లీ శాలరీ కి కాకుండా డిజైన్ కి ఇంతని తీసుకుంటాను, నేను వేస్తున్నట్లు మీ సార్ కి తెలియకూడదు అంటుంది కావ్య. అదంతా ఓకే కానీ మేడం మీరు డబ్బున్నవారు కదా మీకెందుకు మనీ అంటుంది శృతి. పుట్టింటి వారికి సాయం చేయడం కోసం అడిగితే మా ఆయన కావలసినంత ఇస్తారు కానీ నాకే తీసుకోవటం ఇష్టం లేదు అందుకే నేనే సంపాదించాలనుకుంటున్నాను అంటుంది కావ్య.