తాగేసి కృష్ణతోనే ఛాలెంజ్, అన్నంత పని చేసిన లెజెండ్రీ నటుడు.. ఊరికే విశ్వనట చక్రవర్తి అయిపోతారా

Published : Sep 10, 2025, 08:01 AM IST

మద్యం సేవించి షూటింగ్ కి వచ్చిన ఓ లెజెండ్రీ నటుడు సూపర్ స్టార్ కృష్ణతోనే ఛాలెంజ్ చేశారు. అయన ఎవరు ? అసలేం జరిగింది ? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15

సూపర్ స్టార్ కృష్ణ అంటే సాహసాలకు మారుపేరు. తెలుగు సినిమా మరో లెవల్ కి వెళ్లడంలో కృష్ణ పాత్ర ఎంతైనా ఉంది. తెలుగు సినిమా మేకింగ్ లో కృష్ణ ప్రవేశపెట్టిన అనేక కొత్త మార్పులు ఇప్పటి ఫిలిం మేకర్స్ కి ఆదర్శంగా నిలిచాయి. కృష్ణ నటించిన గొప్ప చిత్రాలలో పండంటి కాపురం ఒకటి. లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో 1972లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసింది. 

25

ఈ చిత్ర షూటింగ్  సమయంలో చాలా ఆసక్తికర సంఘటనలు జరిగినట్లు కృష్ణకి మేకప్ మెన్ గా పనిచేసిన మాధవరావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మాధవరావు కృష్ణ గారికి పర్సనల్ మేకప్ మెన్. దీనితో కృష్ణ నటించిన సినిమాలకి సంబంధించిన వివరాలు, తెరవెనుక సంగతులు మొత్తం ఆయనకి తెలుసు. పండంటి కాపురం మూవీలో హేమా హేమీలు నటించారు. ఈ చిత్రంలో జమున, విజయనిర్మల, ఎస్వీ రంగారావు, గుమ్మడి, అల్లు రామలింగయ్య లాంటి వారంతా నటించారు. 

35

ఒక రోజు షూటింగ్ కి ఎస్వీ రంగారావు రాలేదు. ఈ చిత్రంలో ఆయనది అత్యంత కీలకమైన పాత్ర. దీనితో కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డిని పిలిచి.. రంగారావు గారి ఇంటికి వెళ్లి ఆయన్ని తీసుకుని రమ్మని పంపారు. మద్యం సేవించి మత్తులో ఉన్న రంగారావుని ప్రభాకర్ రెడ్డి షూటింగ్ లొకేషన్ కి ఎలాగోలా తీసుకుని వచ్చారు. కారు దిగిన తర్వాత ఆయన మద్యం మత్తులో సరిగ్గా నడవలేకున్నారు. నేను ఈరోజు షూటింగ్ చేయలేనురా.. నన్ను వదిలేయండిరా అని అంటున్నారు. ఈ మత్తులో నటించడం కష్టం అని భావించిన ప్రభాకర్ రెడ్డి రంగారావు ని తిరిగి ఇంట్లో వదిలిపెట్టి వచ్చేశారు. 

45

ఇదంతా గమనించిన గుమ్మడి గారు కృష్ణతో ఇలా అన్నారట. పద్ధతి సరిగ్గా లేదని హరనాథ్ లాంటి నటులనే ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది. రంగారావు లేకపోతే ఇక వేరే నటులు లేరా.. ఇండస్ట్రీలో అద్భుతమైన నటులు చాలా మంది ఉన్నారు కదా.. వాళ్ళని తీసుకోండి అని ఆయన కృష్ణతో అన్నారు. కృష్ణ వెంటనే.. ఈ క్యారెక్టర్ రంగారావు తప్ప ఇంకెవరూ చేయలేరు అని సమాధానం ఇచ్చారు. 

55

గుమ్మడి తన గురించి నెగిటివ్ గా మాట్లాడిన విషయం షూటింగ్ లొకేషన్ లో కొందరి ద్వారా రంగారావు గారికి తెలిసింది. మరుసటి రోజు ఉదయం రంగారావు గారు కృష్ణ ఇంటికి ఫోన్ చేశారు. ఫోన్ నేనే లిఫ్ట్ చేశాను అని మేకప్ మెన్ మాధవరావు అన్నారు. అరేయ్ మాధవరావు.. ఇప్పటి వరకు షూటింగ్ జరిగిన రషెస్ చూడాలి, కృష్ణని రమ్మని చెప్పు అని అన్నారు. దీనితో కృష్ణ, రంగారావు గారు ఇద్దరూ రషెస్ చూశారు. చూసిన తర్వాత రంగారావు కృష్ణతో ఛాలెంజ్ చేశారు. ఇప్పటి వరకు తాగి నటించిన రంగారావుని చూశారు.. ఈ రోజు నుంచి తాగకుండా నటించిన రంగారావు ని చూస్తారు. సినిమా చూశాక ఆడియన్స్ నా గురించే మాట్లాడుకుంటారు చూడు ఇది నా ఛాలెంజ్ అని రంగారావు కృష్ణతో అన్నారు. ఛాలెంజ్ చేసినట్లుగానే అద్భుతంగా రంగారావు పండంటి కాపురం చిత్రంలో నటించారు. ఆయన చెప్పినట్లుగానే రంగారావు లేకుంటే పండంటి కాపురం సినిమా లేదు అని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చినట్లు మాధవరావు తెలిపారు. అందుకే రంగారావు ని విశ్వనట చక్రవర్తి అని ప్రేక్షకులు కొనియాడేవారు అని తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories