శ్రీకాంత్‌ కూతురు మేధ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? నేషనల్‌ లెవల్‌ అథ్లెట్‌.. సినిమాల్లోకి ఎప్పుడంటే?

Published : Sep 09, 2025, 09:34 PM ISTUpdated : Sep 10, 2025, 12:10 AM IST

హీరో శ్రీకాంత్‌ కూతురు మేధ ఆ మధ్య తిరుమలలో మెరిసి అందరిని ఆశ్చర్యపరిచింది. చూడ్డానికి హీరోయిన్‌ మెటీరియల్‌ లా ఉందని అంతా కామెంట్‌ చేశారు. మరి ఇప్పుడు మేధ ఏం చేస్తుంది? అనేది తెలుసుకుందాం. 

PREV
14
హీరో శ్రీకాంత్‌ కూతురు మేధ ఇప్పుడేం చేస్తుంది?

హీరో శ్రీకాంత్‌ మ్యాన్లీ స్టార్‌గా రాణిస్తున్నారు. ఫ్యామిలీ చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఇప్పుడు రూట్‌ మార్చాడు. విలన్‌ పాత్రలతోపాటు కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. బలమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. అయితే శ్రీకాంత్‌ వారసులుగా ఆయన కొడుకు రోషన్‌ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు.  మరో కొడుకు రోహన్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరి కూతురు మేధ  పరిస్థితి ఏంటనేది సస్పెన్స్ గా మారింది.  ఈనేపథ్యంలో ఇప్పుడు మేధ ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది? సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మేధ ఆ మధ్య తిరుమలలో మెరిసింది. శ్రీకాంత్‌ ఫ్యామిలీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నప్పుడు మేధ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చూడ్డానికి హీరోయిన్‌లా కనిపించింది. త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందా అనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. అయితే దీనిపై శ్రీకాంత్‌ నుంచి ఎలా స్పందన లేదు.  

24
శ్రీకాంత్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఊహ

కూతురు మేధకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది  నటి ఊహ. ఊహ ఒకప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా `ఆమె`. ఇందులో శ్రీకాంత్‌ హీరో. ఆయన్నే ప్రేమించింది. పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలు మానేసింది. పిల్లలే సర్వస్వంగా ఉంటోంది. ఫ్యామిలీకే ప్రయారిటీ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె `మహా మాక్స్` టీవీతో ముచ్చటించింది. తన కూతురు మేధ గురించి ఓపెన్‌ అయ్యింది.

34
అండర్‌ గ్రాడ్యూయేట్‌ ఫోర్త్ ఇయర్‌ చేస్తున్న మేధ

మేధ ప్రస్తుతం అండర్‌ గ్రాడ్యూయేట్‌ 4వ ఏడాది చదువుతుందట. విదేశాల్లో చదువుతుందని తెలిపింది ఊహ. తను చిన్నపాటి బిజినెస్‌ కూడా చేస్తున్నట్టు వెల్లడించింది. మేధ సినిమాలపై ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించలేదని, తాను హీరోయిన్‌ అవుతుందో లేదో తెలియదని, గ్రాడ్యూయేట్‌ పూర్తి చేసుకుని వచ్చాక ఈ విషయం గురించి ఆలోచిస్తామని చెప్పింది ఊహ. 

44
క్లాసికల్‌ డాన్సర్‌గా, బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌

ఈ సందర్బంగానే మరో ఆసక్తికర విషయాన్ని తెలిపింది. మేధ టాలెంట్‌ బయటపెట్టింది. ఆమె మంచి క్లాసికల్‌ డాన్సర్‌ అట.  అంతేకాదు తను బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ అని తెలిపింది. ఇన్నాళ్లు ఎప్పుడూ ఈ విషయాన్ని రివీల్‌ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ సీక్రెట్‌ని బయటపెట్టింది ఊహ. బాస్కెట్‌ బాల్‌  నేషనల్‌ లో పార్టిసిపేట్‌ చేసినట్టు తెలిపింది. అయితే స్పోర్ట్స్ అంటే ఇష్టమని, కానీ దానికంటే డాన్స్ నే ఎక్కువగా ఇష్టపడుతుందని చెప్పింది ఊహ. మరి మేధ స్పోర్ట్స్ వైపు వెళ్తుందా? డాన్సర్‌ గా సెటిల్‌ అవుతుందా? సినిమాల్లోకి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories