టాలీవుడ్ డైరెక్టర్ సంస్కారానికి కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ.. అంత ఎమోషనల్ గా ఏం జరిగిందంటే

First Published | Oct 5, 2024, 7:28 PM IST

నటి రమ్యకృష్ణ హీరోయిన్ గా ఒకప్పుడు ఎంత బిజీగా ఉండేదో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమె అంతే బిజీగా అవకాశాలు అందుకుంటున్నారు. బాహుబలిలో శివగామిగా రమ్యకృష్ణ ఎంత అద్భుతంగా నటించిందో అందరికీ తెలిసిందే.

నటి రమ్యకృష్ణ హీరోయిన్ గా ఒకప్పుడు ఎంత బిజీగా ఉండేదో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమె అంతే బిజీగా అవకాశాలు అందుకుంటున్నారు. బాహుబలిలో శివగామిగా రమ్యకృష్ణ ఎంత అద్భుతంగా నటించిందో అందరికీ తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు చిత్రాల్లో కీలక పాత్రలో నటించింది. ఇప్పటికీ రమ్యకృష్ణ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 

గ్లామర్, నటన రెండింటిలో రమ్యకృష్ణకి ఒకప్పుడు తిరుగులేదు. నరసింహ చిత్రంలో అయితే రజనీకాంత్ తో పోటీ పడుతూ నటించింది. ఆహ్వానం లాంటి చిత్రాల్లో ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. అవసరమైనప్పుడు గ్లామర్ ప్రదర్శించేందుకు రమ్యకృష్ణ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఒక టాలీవుడ్ డైరెక్టర్ తో రమ్యకృష్ణకి ఆసక్తికర సంఘటన జరిగిందట. టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉన్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన చిత్రాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. 


శుభలగ్నం, ఆహ్వానం, ఎగిరే పావురమా లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఆహ్వానం చిత్రంలో రమ్యకృష్ణ, శ్రీకాంత్ జంటగా నటించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఎమోషనల్ పెర్ఫామెన్స్ హైలైట్ గా నిలిచింది. కట్నం, విడాకులు కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్ర షూటింగ్ చివరి రోజున ఆసక్తికర సంఘటన జరిగిందట. హీరోయిన్లకు ఎస్వీ కృష్ణారెడ్డి చాలా గౌరవం ఇస్తారు. అందుకే ఆయన దర్శకత్వంలో నటించేందుకు హీరోయిన్లు ఇష్టపడతారట. కొన్ని కారణాల వల్ల నటించలేకపోయినప్పటికీ ఆయనకీ ప్రత్యేకంగా ఫోన్ చేసి క్షమాపణ అడుగుతారు. సౌందర్య అలాగే చేసింది. 

Also Read: పవన్ కళ్యాణ్, పునీత్ రాజ్ కుమార్, కార్తీ ముగ్గురిలో ఎవరికీ సాధ్యం కాని కామన్ క్వాలిటీ.. నాగార్జున కామెంట్స్

ఎందుకు హీరోయిన్లు మిమల్ని అంతలా గౌరవిస్తారు అని యాంకర్ అడగగా.. కృష్ణారెడ్డి సమాధానం ఇచ్చారు. ఆహ్వానం మూవీ షూటింగ్ చివరి రోజున రమ్యకృష్ణకి వెండి పళ్లెంలో పట్టు చీర, పసుపు కుంకుమ, 10 వేల రూపాయల డబ్బు పెట్టి తెలుగింటి ఆడపడుచులా తాంబూలం ఇచ్చాం. అంతలా ఆమెని గౌరవించాం. వాళ్ళని అంత మర్యాదగా చూసుకుంటే మనల్ని కూడా గౌరవిస్తారు. ఆ రోజు రమ్యకృష్ణ నా చేయి పట్టుకుని ఎమోషనల్ అయింది. ఏడ్చేసింది అని ఎస్వీ కృష్ణారెడ్డి రెడ్డి తెలిపారు. 

రమ్యకృష్ణ టాలీవుడ్ లో నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, శ్రీకాంత్, బాలకృష్ణ ఇలా అందరి హీరోలతో నటించింది. ప్రస్తుతం తల్లి, అత్త తరహా పాత్రల్లో రాణిస్తున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి ఇటీవల సైలెంట్ అయ్యారు. బహుశా కొత్త దర్శకుల ప్రభావం కావచ్చు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న చిత్రాలపై తన అభిప్రాయం చెప్పారు. దర్శకుడు సరికొత్త విధానాలతో సినిమాలు తెరకెక్కిస్తుండడం, అశ్లీలత లాంటి అంశాల గురించి మాట్లాడారు.డైరెక్టర్ గా నా అప్రోచ్ వేరు అని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. నా చిత్రాల్లో కొన్ని రూల్స్ ఫాలో అవుతాను. ఎక్కడా బూతులు తిట్టే డైలాగులు ఉండకూడదు అనేది మొదటిది. ఆ తర్వాత డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఉండకూడదు. చివరికి హీరోయిన్ పైట సరిగ్గా లేకపోయినా, పైట చెంగు జారినా సరే ఒప్పుకోను. వెంటనే కట్ చెప్పేస్తాను.

Latest Videos

click me!