మీటూ ఆరోపణలపై బాలకృష్ణ రియాక్షన్‌ ఇదే, ఏం చేయాలో చెప్పిన నటసింహం!

First Published | Oct 5, 2024, 6:01 PM IST

టాలీవుడ్‌లోనూ మీటూ ఆరోపణలు వినిపిస్తుంటాయి. దీనిపై బాలయ్య స్పందించారు. ఆయన అదిరిపోయే ఆన్సర్‌ ఇచ్చారు. ఇంతకి ఏం చెప్పాడంటే?
 

బాలకృష్ణ టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన నటుడు. ఆయన నటుడిగా ఓ రకంగా ఆల్‌ రౌండర్‌ అని చెప్పొచ్చు. మాస్‌ చేయగలడు, క్లాసూ చేయగలడు. లవ్‌ స్టోరీ చేశాడు, యాక్షన్‌ మూవీస్‌ చేశాడు. పౌరాణికాలు చేశాడు, జానపదాలు చేశాడు, సాంఘీకాలు చేశాడు. సోషియో ఫాంటసీలు చేశాడు. ప్రస్తుతం తెలుగులో ఉన్న హీరోల్లో ఇలాంటి పాత్రలు, ఇలాంటి సినిమాలు చేయగలిగే హీరో ఎవ్వరూ లేరని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆయన లవ్‌ ట్రాక్‌లు రక్తికట్టిస్తుంటాడు. మొన్న `భగవంత్‌ కేసరి`, అంతకు ముందు `వీరసింహారెడ్డి` సినిమాల్లోనూ చిన్న పాటి లవ్‌ ఎపిసోడ్లు చేసి మెప్పించాడు. తన ఫ్యాన్స్ కి ట్రీట్‌ ఇచ్చాడు. అందుకే బాలయ్య అంటే తన అభిమానులకు చాలా స్పెషల్‌. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

అదే సమయంలో బాలయ్యపై పలు నెగటివ్‌ కామెంట్స్ కూడా ఉన్నాయి. ఆయన ప్రవర్తన చాలా వరకు వార్తల్లో నిలుస్తుంది. ఈవెంట్లలో అభిమానులను కొట్టడం తరచూ వింటుంటాం. అయితే దాన్ని తన ప్రేమగా చెబుతుంటాడు బాలయ్య. అంతేకాదు అభిమానులు కూడా దాన్ని అలానే తీసుకుంటారు. మీడియాలో, సోషల్‌ మీడియాలో అది పెద్ద రచ్చ అవుతుంటుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం దాన్ని పాజిటివ్‌గానే తీసుకుంటారు. బాలయ్య కూడా అదే విషయం చెప్పాడు. అలా బాలయ్యకి, తన అభిమానులకు ఆ స్థాయిలో సింక్‌ కుదురుతుందని చెప్పొచ్చు. ఇలాంటి అభిమానులు కేవలం బాలయ్యకు మాత్రమే ఉంటారు. 
 


బాలకృష్ణపై కొన్ని రకాల ఆరోపణలు కూడా వచ్చాయి. మొన్నటి వరకు మలయాళ ఇండస్ట్రీని షేక్‌ చేసిన `మీటూ` లాంటి ఆరోపణలు బాలయ్య విషయంలోనూ వచ్చాయి. కానీ అవి గాలి వార్తలుగానే మిగిలిపోయాయి. హీరోయిన్లని కొడతాడని అన్నారు. ఇబ్బంది పెడతారనే ఆరోపణలు వచ్చాయి. కానీ అవి నిజం కాదని ఆయనతో పనిచేసిన చాలా మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వెల్లడించారు. బాలయ్య కల్మషం లేని వ్యక్తి అని, సెట్‌లో చాలా జోవియల్‌గా ఉంటారని చాలా మంది ఆర్టిస్ట్ లు చెప్పడం విశేషం.
 

ఇదిలా ఉంటే `మీటూ` ఆరోపణలపై బాలయ్య స్పందించారు. ఆ మధ్య మలయాళంలో జస్టీస్‌ హేమ కమిటీ రిపోర్ట్ పెద్ద దుమారం రేపింది. అనంతరం టాలీవుడ్‌లోనూ అలాంటి ఆరోపణలు వచ్చాయి. జానీ మాస్టర్‌పై ఆరోపణలు వచ్చాయి. పూనమ్‌ కౌర్‌ సైతం తరచూ ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. శ్రీరెడ్డి అప్పట్లో దుమారం రేపింది. మరికొందరు చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు. ఈ క్రమంలో దీనిపై బాలకృష్ణ స్పందించారు. టాలీవుడ్‌లో ఇలాంటి ఆరోపణలపై మీరేమని సమాధానం చెబుతారు, దీన్ని ఎలా చూస్తారనే ప్రశ్న యాంకర్ నుంచి వచ్చింది. దీనికి బాలయ్య స్పందించారు. 
 

మన వద్ద అలాంటివి సంఘటనలు లేవని తెలిపారు. మన దగ్గర అలాంటిది లేదని, ఒకటి రెండు అడపాదడపా ఎక్కడో చోట జరుగుతుంటాయని, వాటిని కఠినంగా శిక్షించాల్సిందే అన్నారు. ఆయన మాట్లాడుతూ, నాకు తెలిసి మన దగ్గర అలాంటిది లేదు. ఇలాంటివి జరిగినప్పుడు విచారిస్తుంటా. ఏంటి ఏం జరుగుతుందని? అనేది తెలుసుకుంటాను. రేర్‌గా ఒకటి రెండు జరుగుతుండొచ్చు. కానీ ఇవి కూడా జరగకూడదు. ఆర్టిస్ట్ లు చాలా మంది ఇతర భాషల నుంచి వస్తారు. టాలెంట్‌ని చూపించుకోవాలనుకుంటారు. అలాంటి వారికి ఇవి ఎదురైతే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఏదైనా జరిగితే కచ్చితంగా ఇండస్ట్రీ, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలి. తప్పులు చేసిన వారిని శిక్షించాలి అని తెలిపాడు బాలయ్య.
 

ఆయన ప్రస్తుతం `ఎన్బీకే 109` సినిమాలో నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో బాలయ్యకి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తుంది. ఈ మూవీని వచ్చే సంక్రాంతి ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బాలయ్యని ఈ సినిమాలో మరింత కొత్తగా చూపించబోతున్నారట బాబీ. 

Latest Videos

click me!