గతంలో ఎన్నడూ చూపించని విధంగా పోకిరి లో మహేష్ ని ప్రజెంట్ చేశాడు. మహేష్ బాబుకు జంటగా ఇలియానాను తీసుకున్నారు. అప్పటికి ఇలియానా దేవదాసు చిత్రం చేసి ఉంది. పెద్దగా ఫేమ్ లేని ఆమెకు మహేష్ బాబు పక్కన ఛాన్స్ దక్కింది. ప్రకాష్ రాజ్ ప్రధాన విలన్. నాజర్, బ్రహ్మానందం, అలీ, అజయ్, సుధ, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే ఇతర కీలక రోల్స్ చేశాడు.
పోకిరి చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. 2006 ఏప్రిల్ 27న సమ్మర్ కానుకగా విడుదల చేశారు. ఫస్ట్ డే మూవీకి మిక్స్స్ టాక్. మెల్లగా మూవీ పుంజుకుంది. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. టాలీవుడ్ రికార్డ్స్ పోకిరి బ్రేక్ చేసింది. పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్... ఎవర్ గ్రీన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు.. వంటి డైలాగ్స్ ఓ రేంజ్ లో పేలాయి.