హీరోయిన్ పైట జారితే ఒప్పుకోను..మిస్టర్ బచ్చన్, సలార్ సినిమాలపై ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్

First Published Sep 9, 2024, 10:14 AM IST

ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న చిత్రాలపై తన అభిప్రాయం చెప్పారు. దర్శకుడు సరికొత్త విధానాలతో సినిమాలు తెరకెక్కిస్తుండడం, అశ్లీలత లాంటి అంశాల గురించి మాట్లాడారు.

sv krishna reddy

టాలీవుడ్ లో అద్భుతమైన దర్శకులలో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా మిక్స్ మిక్స్ చేసి సినిమాలు చేయడంలో ఆయనకి ప్రత్యేక శైలి ఉంది. శుభలగ్నం లాంటి ఆల్ టైం క్లాసిక్ మూవీ తెరకెక్కించింది కూడా ఈయనే. శుభలగ్నంతో పాటు రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు లాంటి చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఎస్వీ కృష్ణారెడ్డి రాణించారు. 

ఎస్వీ కృష్ణారెడ్డి ఇటీవల సైలెంట్ అయ్యారు. బహుశా కొత్త దర్శకుల ప్రభావం కావచ్చు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న చిత్రాలపై తన అభిప్రాయం చెప్పారు. దర్శకుడు సరికొత్త విధానాలతో సినిమాలు తెరకెక్కిస్తుండడం, అశ్లీలత లాంటి అంశాల గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూస్తుంటే ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఉంటున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ ప్రశ్నించింది. 

Latest Videos


Mr. Bachchan

డైరెక్టర్ గా నా అప్రోచ్ వేరు అని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. నా చిత్రాల్లో కొన్ని రూల్స్ ఫాలో అవుతాను. ఎక్కడా బూతులు తిట్టే డైలాగులు ఉండకూడదు అనేది మొదటిది. ఆ తర్వాత డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఉండకూడదు. చివరికి హీరోయిన్ పైట సరిగ్గా లేకపోయినా, పైట చెంగు జారినా సరే ఒప్పుకోను. వెంటనే కట్ చెప్పేస్తాను. 

అసిస్టెంట్ ని పంపించి చీర సరిచేసుకోమని చెబుతాను అని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. హీరోయిన్ మాత్రమే కాదు నటీమణుల అందరి విషయంలో నా అభిప్రాయం ఇలాగే ఉంటుంది. నేను అలాగే సినిమాలు తీస్తాను అని అన్నారు. ఈ మధ్యన ఒక సినిమా చాలా బావుందని చెప్పారు. చూద్దామని వెళ్ళాను. కానీ ఇంటర్వెల్ కే దండం పెట్టి వచ్చేశాను అని అన్నారు. ఆ సినిమా పేరు చెప్పడానికి ఎస్వీ కృష్ణారెడ్డి ఇష్టపడలేదు. 

అదేవిధంగా రవితేజ మిస్టర్ బచ్చన్ చిత్రం వచ్చింది. రవితేజ పాత్ర, విలన్ పాత్ర బావుందని చెప్పారు. కానీ అది చూడదగిన సినిమా కాదని అన్నారు. దీనితో ఆ మూవీ చూడడం మానేశాను అంటూ ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా హిట్ అవ్వాలంటే ఒక్కటే రూల్ ఉంది.. సినిమా ప్రారంభం అయిన 7 నిమిషాల లోపు చూస్తున్న ప్రేక్షకులకు ఆసక్తి పెరగాలి. అలా చేస్తేనే ఆ చిత్రాన్ని ఇంట్రెస్ట్ గా చూస్తారు అని తెలిపారు. 

ఇటీవల ప్రభాస్ సలార్ చిత్రం వచ్చింది. అది ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే చిత్రం. అందులో వెయిట్ ఎంతైనా ఉండొచ్చు. కానీ సినిమా మొత్తం ఎంగేజ్ చేస్తూ మొమెంటం మైంటైన్ చేశారు. అందుకే సలార్ సక్సెస్ ఫుల్ చిత్రం అయింది అని అన్నారు. 

click me!