కంటెస్టెంట్స్ ఫస్ట్ వీక్ ప్రోగ్రెస్ కార్డ్, ఎవరు టాప్? ఎవరు లీస్ట్?

First Published | Sep 9, 2024, 7:34 AM IST


మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 8 ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. 14 మంది పాల్గొనగా,  బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. మిగిలిన 13 మంది కంటెస్టెంట్స్ లో ఎవరి పెర్ఫార్మన్స్ ఎలా ఉంది?
 

బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా మొదటివారం పూర్తి చేసుకుంది. సోషల్ మీడియా స్టార్ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. శేఖర్ బాషా, నాగ మణికంఠ, విష్ణుప్రియ, పృథ్విరాజ్, సోనియా ఆకుల, బెజవాడ బేబక్క నామినేట్ అయ్యారు. వీరిలో బేబక్కకు అత్యల్పంగా ఓట్లు పోల్ అయ్యాయి. దాంతో ఆమె ఎలిమినేట్ అయ్యారని నాగార్జున వెల్లడించాడు. 

ఇక హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈసారి పెద్దగా పేరున్న సెలెబ్స్ షోకి రాలేదు. బిగ్ బాస్ వలన పాజిటివిటీ కంటే నెగిటివిటీకి ఎక్కువ అవకాశం ఉంది. అనవసరంగా కెరీర్ రిస్క్ లో పడుతుందని టాప్ సెలెబ్స్ ఈ షోకి దూరంగా ఉంటున్నారు. సీజన్ 8 కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులు కొంత నిరాశకు గురయ్యారు. 

Bigg Boss Telugu 8


మొదటి వారం ముగియగా కంటెస్టెంట్స్ పై ఆడియన్స్ కి ఒక అభిప్రాయం వచ్చింది. ఎవరు ఎలా ఆడుతున్నారో... ఒక అంచనాకు వచ్చారు. మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయంలో శేఖర్ బాషా కంటెంట్ ఇస్తున్నాడు. ఎంటర్టైన్ చేస్తున్నాడు. అతడి జోక్స్ కొన్ని సార్లు చిరాకు తెప్పించినా మరికొన్ని సందర్భాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. 

లేడీ కంటెస్టెంట్స్ నైనిక, ప్రేరణ పట్ల కూడా ఆడియన్స్ లో ఒకింత పాజిటివ్ ఒపీనియన్ ఉంది. వీరిద్దరి గేమ్ బాగుందని సోషల్ మీడియా టాక్. నైనిక మొదటి వారానికి గాను ముగ్గురు చీఫ్స్ లో ఒకరిగా ఎంపికైన సంగతి తెలిసిందే. 
 


మరోవైపు ఓ ముగ్గురు కంటెస్టెంట్స్ పై కొంత నెగిటివిటీ నడుస్తుంది. తన కన్నీటి గాథలు వినిపిస్తూ నాగ మణికంఠ సింపతీ గేమ్ ఆడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బయటపెట్టడం, విగ్గు తీసేయడం నాగ మణికంఠకు ప్లస్ కంటే మైనస్ అయ్యాయి. 

ఇక నేను ఆడపులిని అంటూ ట్యాగ్ తగిలించుకుని తిరుగుతున్న సోనియా ఆకుల గేమ్ పట్ల కూడా ప్రేక్షకుల్లో నెగిటివ్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. కాన్ఫిడెన్స్ కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఆమెలో కనిపిస్తుంది. కారణం లేకపోయినా కంటెంట్ కోసం మాట్లాడుతుందేమో అనిపిస్తుంది.

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
 

మరో లేడీ కంటెస్టెంట్ యాష్మి గౌడ మీద కొంత నెగిటివిటి ఉంది. ఇక విష్ణుప్రియ, నబీల్, సీత, నిఖిల్, ఆదిత్య ఓం, అభయ్, పృథ్విరాజ్ న్యూట్రల్ గా ఉన్నారు. వీరి మీద ఆడియన్స్ లో బ్యాడ్ ఆర్ గుడ్ ఇంప్రెషన్ లేదు. ఎందుకంటే వీరు ఇంకా గేమ్ బయటకు తీయలేదు. మొదటివారం అలా అలా లాగించేశారు. 

ప్రస్తుతానికి ఫేమ్ రీత్యా విష్ణుప్రియ టైటిల్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. నిఖిల్, ఆదిత్య ఓం, యాష్మి గౌడ, శేఖర్ బాషా, నాగ మణికంఠ టైటిల్ రేసులో ఉండే అవకాశం ఉంది. మరో రెండు వారాలు గడిస్తే కంటెస్టెంట్స్ గేమ్ పై మరింత అవగాహన వస్తుంది. విష్ణుప్రియ ఓ మోస్తరు గేమ్ ఆడినా టైటిల్ రేసులో ఉంటుంది. 

విష్ణుప్రియకు  భారీ రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారట.  ఈ సీజన్ కి అత్యధికంగా విష్ణుప్రియ వారానికి రూ. 4 లక్షలు తీసుకుంటుందని సమాచారం. ఆమె తర్వాత నటుడు ఆదిత్య ఓం వారానికి రూ. 3 లక్షలు ఛార్జ్ చేస్తున్నాడని సమాచారం. ఆదిత్య ఓం మొదటి వారం పెద్దగా ప్రభావం చూపలేదు. విష్ణుప్రియ, ఆదిత్య ఆన్ ఫినాలేకి వెళ్లే అవకాశం ఉంది.. 
 

Latest Videos

click me!