బాలయ్య-మహేష్ బాబు మల్టీస్టారర్, కథ కూడా సిద్ధం, సంచలనంగా మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్స్!

First Published | Sep 9, 2024, 9:15 AM IST


బాలకృష్ణ-మహేష్ బాబు మల్టీస్టారర్ చేస్తారు. ఆ కథ కూడా నేను విన్నానంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 
 

RRR (Rs 550 crore)

టాలీవుడ్ లో చాలా అరుదుగా మల్టీస్టారర్స్ తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కలిసి పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. ఆ తర్వాత జనరేషన్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. పెద్దగా ఆసక్తి చూపలేదు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ అతిపెద్ద మల్టీస్టారర్ అని చెప్పొచ్చు. 

నందమూరి-మెగా హీరోలు కలిసి మూవీ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఆర్ ఆర్ ఆర్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్-మహేష్ బాబు కాంబోలో మూవీ వస్తే చూడాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకటేష్ పాత్రకు పవన్ కళ్యాణ్ ని అనుకున్నాడట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. 


Balakrishna and Mahesh Babu

కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ని ఆడియన్స్ కోరుకుంటున్నారు. అయితే అవి సాకారం కావడం లేదు. తాజాగా సెన్సేషనల్ కాంబో తెరపైకి వచ్చింది. మహేష్ బాబు-బాలకృష్ణ మూవీ చేస్తున్నారంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అన్నారు. 

తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ షోకి థమన్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి యాంకర్ గా ఉన్న సింగర్ శ్రీరామచంద్ర థమన్ ని ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. ఏక కాలంలో బాలకృష్ణ, మహేష్ బాబు సినిమాలకు పని చేయాల్సి వస్తే... ఇద్దరిలో మీ ఛాయిస్ ఎవరు? అని అడిగారు. 
 

Thaman

అందుకు సమాధానంగా థమన్... బాలకృష్ణ-మహేష్ బాబు కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారు. ఆ మూవీ కథ కూడా నేను విన్నాను, అన్నారు. దాంతో ఆ వేదిక ఈలలతో   మారు మ్రోగింది. క్లాస్ మాస్ కాంబినేషన్ లో మూవీ అంటే మామూలుగా ఉండదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అయితే థమన్ కామెంట్స్ లో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. ఆ మూవీ నుండి మహేష్ బాబు బయటకు వచ్చేందుకు కనీసం మూడేళ్లు పడుతుంది. రాజమౌళి ఇంకా మూవీ షూటింగ్ స్టార్ట్ చేయలేదు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

 

మరోవైపు బాలకృష్ణ NBK 109 పూర్తి చేస్తున్నారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రం పై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. 

అనంతరం బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనుతో మూవీ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన జరిగింది. బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగవ చిత్రం ఇది.  బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సింహ, లెజెండ్, అఖండ విజయం సాధించాయి. 

కాబట్టి మహేష్ బాబు, బాలకృష్ణలకు ఉన్న కమిట్మెంట్స్ రీత్యా... ఇప్పట్లో థమన్ చెప్పిన మల్టీస్టారర్ పట్టాలెక్కే సూచనలు లేవు. అందుకు చాలా సమయం ఉంది. రాజమౌళి మూవీ విడుదలయ్యాక మహేష్ బాబు విషయంలో సమీకరణాలు ఎలా ఉంటాయో చెప్పలేం. అయితే బాలకృష్ణ-మహేష్ బాబు మూవీ చేస్తే చూడాలని ఫ్యాన్స్ మాత్రం భావిస్తున్నారు. 

ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ షోలో మహేష్ బాబును బాలయ్య ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఎపిసోడ్ సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. అరుదుగా ఇంటర్వ్యూలు ఇచ్చే మహేష్ బాబు బాలయ్య కోసం ఆ షోలో పాల్గొన్నారు. 

Latest Videos

click me!