చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో నిర్మాతగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆమె నాగబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన చివరి చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఒక రీజినల్ మూవీ ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం సంచలనమే అని చెప్పాలి. ఏకంగా ఈ చిత్రం రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
25
నిర్మాతగా చిరంజీవి కూతురు సక్సెస్
ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, సాహు గారపాటి కలసి నిర్మించారు. నిర్మాతగా సుస్మిత కొణిదెల ఈ చిత్రంతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో తన బాధ్యత ఇంకా పెరిగింది అని సుస్మిత పేర్కొంది. ఇటీవల 50 రోజులు ఆడిన సినిమాలు చాలా రేర్. కానీ మన శంకర వరప్రసాద్ గారు ఆ ఫీట్ సాధించింది. దీనితో నాన్నగారి గత సినిమాలు, పథ అనుభవాలు మొత్తం గుర్తుకు వచ్చాయి.
35
అభిమానులతో ఎమోషనల్ అటాచ్మెంట్
ఈ సినిమా ప్రచారం కోసం అభిమానులని కలుసుకున్నాను. అది సరికొత్త అనుభూతి. నాన్న గారు అభిమానుల విషయంలో చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. చిరంజీవి గారికి, అభిమానులకు మధ్య డైరెక్ట్ గా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది.
కానీ ప్రతిసారి నాన్నగారు అభిమానులకు డైరెక్ట్ గా కలుసుకోవడం కుదరదు. కానీ బాబాయ్ నాగబాబు గారు చిరంజీవి గారికి, అభిమానులకు మధ్య ఒక వారధిలా ఉన్నారు. చాలా ఏళ్లుగా నాగబాబు గారు ఆ పని చేశారు. ఇకపై ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని సుస్మిత కొణిదెల తెలిపారు.
55
రాజకీయాలతో నాగబాబు బిజీ
చిరంజీవి గారి అభిమానులు, చరణ్ అభిమానులు ఎవరి అభిమనులు అయినా సరే నేను వారధిలా ఉంటా అని సుస్మిత పేర్కొంది. నాగబాబు గారు ప్రస్తుతం జనసేన పార్టీ, రాజకీయాలతో బిజీగా ఉన్నారు కాబట్టి ఇకపై ఆయన చేసే పని నేను చేస్తా అని సుస్మిత పేర్కొంది.