Monalisa Bhosle: కెరీర్‌ని నాశనం చేసుకుంటోంది, మోనాలిసాపై ట్రోల్స్.. లవ్‌ జిహాద్‌ కామెంట్లపై నటి కౌంటర్‌

Published : Mar 13, 2026, 03:26 PM IST

Monalisa Bhosle: కుంభమేళ స్టార్‌ మోనాలిసా తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో దారుణంగా ట్రోలింగ్‌ జరుగుతుంది. దీనిపై మోనాలిసా స్పందించింది. 

PREV
15
కుంభమేళలో పాపులర్‌ అయిన మోనాలిసా భోంస్లే

మహాకుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించి వైరల్‌ స్టార్‌గా మారింది మోనాలిసా. సోషల్‌ మీడియా ఆమెని స్టార్‌ని చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది. ఈ దెబ్బతో మోనాలిసా భోంస్లేకి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఓ బాలీవుడ్‌ దర్శకుడు సనోజ్‌ మిశ్రా ఏకంగా ఆమెని హీరోయిన్‌గా తీసుకుని ఓ సినిమాని కూడా ప్రారంభించారు. అలాగే మలయాళంలో ఓ మూవీ ప్రారంభమయ్యింది. తెలుగులోనూ సినిమా స్టార్ట్ అయ్యింది.

25
పెళ్లితో షాకిచ్చిన మోనాలిసా

నటిగా బిజీ అవుతున్న సమయంలో మోనాలిసా పెద్ద షాకిచ్చింది. ప్రియుడిని పెళ్లి చేసుకొని అందరిన ఆశ్చర్యపరిచింది. ఆమె కేరళాలోని తిరువనంతపురం, నేమం సమీపంలో ఉన్న అరుమనూర్‌ జై నైనార్‌ దేవాలయంలో తన ప్రియుుడు మహారాష్టకి చెందిన ఫర్హాన్‌ ఖాన్‌ని ఆమె హిందూ సాంప్రదయం ప్రకారం పెళ్లి చేసుకుంది. దీంతో ఆమె పెళ్లిపై విమర్శలు వస్తున్నాయి. దారుణంగా ట్రోలింగ్‌ జరుగుతుంది. సోషల్‌ మీడియా స్టార్‌ని చేస్తే, ఆమె తన కెరీర్‌ని నాశనం చేసుకుంటుందని, ప్రేమ పెళ్లి మాయలో పడి మంచి లైఫ్‌ని చెడగొట్టుకుంటుందని విమర్శలు వస్తున్నాయి.

35
మోనాలిసాపై దారుణంగా ట్రోలింగ్‌

వంద కోట్లలో ఎవరికీరాని క్రేజ్‌, పాపులారిటీ మోనాలిసాకి వచ్చింది. కానీ ఆమె దాన్నంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరులా మార్చిందంటున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తనకు ఆఫర్‌ ఇచ్చిన దర్శకుడు సనోజ్‌ మిశ్రా తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెతో సినిమా కోసం తాను పది కోట్లు లోన్‌ తీసుకున్నానని, తన ప్రవర్తన వల్ల జైలుకి కూడా వెళ్లి వచ్చానని వెల్లడించారు. ఇది లవ్‌ జిహాద్‌ లో భాగమే అని తెలిపారు. ఇలా చాలా మంది విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా మోనాలిసా స్పందించింది.

45
ట్రోల్స్ కి మోనాలిసా కౌంటర్‌

తన భర్తతో కలిసి ఆమె మీడియా ముందుకు వచ్చింది. లవ్‌ జిహాద్‌ కామెంట్ లో నిజం లేదని, తాము హిందూ సాంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది. తనకు అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉందని, ఒక మేజర్‌గా తనకిష్టమైన వ్యక్తిని ఎంచుకునే హక్కు తనకు ఉందని  వెల్లడించింది.అయితే పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తానని చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉంటే మోనాలిసా తండ్రి విజయ్‌ సింగ్‌ భోంస్లే వీరి పెళ్లిని వ్యతిరేకించారు. ఆమెని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో తనకు భద్రత కల్పించాలని మోనాలిసా కేరళ పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉంటే మోనాలిసాకి కేరళ మంత్రులు సపోర్ట్ చేయడం గమనార్హం.

55
తెలుగులో సినిమా చేస్తోన్న మోనాలిసా

మోనాలిసా ఇప్పుడు తెలుగులో `లైఫ్‌` అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో సాయి కిరణ్‌ హీరో. శ్రీను కోటపాటి దర్శకుడు. వంగమాంబ క్రియేషన్స్ పతాకంపై అజయ్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆ మధ్యనే ఈ సినిమా ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రారంభమైంది. దీంతోపాటు మలయాళంలో`నాగమ్మ`, బాలీవుడ్‌లో `ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌` అనే చిత్రాల్లో నటిస్తోంది మోనాలిసా. మరి వీటిని పూర్తి చేస్తుందా? మధ్యలోనే వదిలేస్తుందా అనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories