సూపర్ స్టార్ కృష్ణ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తెలుగు ఆడియన్స్ లో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ సూపర్ స్టార్ ను అభిమానిస్తుంటారు. కృష్ణ కోసం 100 కిలోమీట్ల దూరం లారీలో వెళ్లి సినిమా చూసి వచ్చిన ముఖ్యమంత్రి గురించి మీకు తెలుసా?
అలనాటి టాలీవుడ్ హీరోలలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. సినిమా కోసం ఆయన చేసిన సాహసాలు, ఆయన చేసిన ప్రయోగాలు కృష్ణకు ఎనలేని కీర్తిని, కోట్లది అభిమానులను సంపాదించి పెట్టింది. ఇండస్ట్రీలో మంచి వ్యక్తిగా గుర్తింపు ఉన్న కృష్ణ.. నిర్మాతల పాలిట దేవుడయ్యాడు. ఇక కృష్ణ చేసిన డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాయి. సాహస గాధలు, కౌబాయ్ సినిమాలు, జేమ్స్ బాండ్ లాంటి ట్రెండ్స్ కృష్ణ టాలీవుడ్ కు పరిచయం చేశాడు. చేసిన ప్రతీ ప్రయోగంలో సక్సెస్ అయ్యాడు.
24
కృష్ణకు సెలబ్రిటీ అభిమానులు..
సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల వల్లే.. టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు, రాజీకియ నాయుకలు కూడా కృష్ణకు అబిమానులుగా మారిపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూడా కృష్ణ అభిమానే. ఇక మరో ముఖ్యమంత్రి కూడా కృష్ణ సినిమాలు చూడటం కోసం కాలేజీ రోజుల్లో 100 కిలో మీటర్లు లారీల్లోప్రయాణించేవాడట. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. ఆయన ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
34
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
సూపర్ స్టార్ కృష్ణకు రేవంత్ రెడ్డి వీరాభిమాని. ఆయన సినిమాలు వదిలిపెట్టకుండా చూసేవాడట సీఎం. రేవంత్ రెడ్డి ఓ సభలో మాట్లాడుతూ.. '' నేను సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమానిని. ఆయన సినిమాలు వదిలిపెట్టుకుండా చేస్తుంటాను. వనపర్తిలో కాలేజీ స్టడీస్ చేసే రోజుల్లో కృష్ణ సినిమాలు చూడటానికి చాలా పట్టుదలగా వెళ్లేవారము. వనపర్తిలో థియేటర్లు ఉండేవి కావు.. అయితే హైదరాబాద్, లేకపోతే కర్నూల్ రావల్సిందే. కృష్ణ గారి సినిమా చూడటానికి 100 కిలోమీటర్లు కర్నూల్ కు లారీలో వెళ్లి.. సినిమా చూసి వచ్చేవారము'' అని రేవంత్ రెడ్డి అన్నారు.
టాలీవుడ్ లో తన మార్క్ చూపించుకోవడం కోసం కృష్ణ చాలా ప్రయోగాలు చేశాడు. తెలుగు పరిశ్రమను కొత్తదనం వైపు నడిపించాడు. కొత్త టెక్నాలజీలు పరిచయం చేశాడు. డిఫరెంట్ జానర్ లో సినిమాలు ప్రయత్నించాడు. యాక్షన్ సీన్స్, కౌబాయ్ మూవీస్, జేమ్స్ బాండ్ మూవీస్, కలర్ స్క్రీన్, స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ తో పాటు.. రకరకాల పాత్రను ప్రయత్నించి.. తెలుగు ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇలా టాలీవుడ్ లో ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు.