సుష్మిత కొణిదెల పాన్ ఇండియా సినిమా ఎప్పుడు.. రాంచరణ్ ఓకె చెప్పారా ?

Published : Jan 23, 2026, 04:11 PM IST

Sushmita Konidela: తన తండ్రి చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమా నిర్మించి సుస్మిత కొణిదెల భారీ విజయం అందుకున్నారు. ఆమె నెక్స్ట్ మూవీ ఎవరితో అనే చర్చ మొదలైంది. 

PREV
15
మెగా డాటర్ సుస్మిత కొణిదెల

మెగా డాటర్ సుస్మిత కొణిదెల తన తండ్రి చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు అనే చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తన తండ్రితో నిర్మించిన సినిమా సూపర్ హిట్ కావడంతో మెగా డాటర్ సంతోషంలో మునిగిపోతున్నారు. సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు.

25
నిర్మాతగా భారీ విజయం 

గతంలో ఆమె శ్రీదేవి ఇచ్చారు శోభన్ బాబు అనే చిత్రాన్ని నిర్మించారు. మన శంకర వరప్రసాద్ గారు హిట్ కావడంతో ఇప్పుడు సుస్మిత పై ఫోకస్ పెరిగింది. ఆమె నెక్స్ట్ ఎలాంటి సినిమాలు నిర్మిస్తారు అనే చర్చ మొదలైంది. 

35
రాంచరణ్ తో సినిమా 

ఓ ఇంటర్వ్యూలో రాంచరణ్ తో సినిమా నిర్మిస్తారా అని ప్రశ్నించగా సుస్మిత సమాధానం ఇచ్చారు. రాంచరణ్ తో సినిమా చేయాలనేది నా టార్గెట్ కాదు కానీ ఆ కోరిక ఉంది. ఎప్పటికైనా చరణ్ తో సినిమా చేస్తాను. రాంచరణ్ నిర్మాతల క్యూలో నేను కూడా ఉంటాను. 

45
తమ్ముడితో పాన్ ఇండియా సినిమా 

కానీ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం తెలియదు. ఒక వేళ సుస్మిత.. రాంచరణ్ అక్కా తమ్ముళ్ల కాంబోలో సినిమా ఉంటే అది పాన్ ఇండియా సినిమానే అవుతుంది. ఎందుకంటే రాంచరణ్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. 

55
క చరణ్ కి చెబుతా : సుస్మిత 

ఇతన కోసం ప్రొడ్యూసర్ గా నేను కూడా క్యూలో ఉన్నట్లు రాంచరణ్ కి ఇంతవరకు చెప్పలేదు. మన శంకర వరప్రసాద్ గారు హిట్ అయింది కదా ఇక చెప్పేస్తా అని సుస్మిత నవ్వుతూ అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories