Soundarya: మరణించే సమయానికి హీరోయిన్ సౌందర్య ఐదు నెలల గర్భవతి, చెప్పిన సీనియర్ డైరెక్టర్

Published : Jan 23, 2026, 02:51 PM IST

Soundarya: హీరోయిన్ సౌందర్యను మర్చిపోవడం తెలుగు ప్రేక్షకులకు అంత సులువుకాదు. ఆమె మరణించేనాటికి ఆమె అయిదు నెలల గర్భవతి అని తెలుస్తోంది. అప్పట్లో కూడా దీనిపై ఎన్నో వార్త కథనాలు వచ్చాయి. కానీ ఎవరూ వీటిని ధ్రువీకరించలేదు. 

PREV
14
32 ఏళ్ల వయసులో సౌందర్య

తెలుగు సినీ పరిశ్రమ సౌందర్యను మర్చిపోలేదు. ఆమెను సహజనటిగా పిలుచుకుంటారు. కుటుంబ ప్రేక్షకుల అభిమానం పొందిన మహానటి ఆమె. సౌందర్య మరణం ఇప్పటికీ ఎంతోమంది అభిమానులకు బాధాకరమైన ఒక జ్ఞాపకం. 2004 ఏప్రిల్ 17న జరిగిన విమాన ప్రమాదంలో 32 ఏళ్ళ వయసులోనే ఆమె మరణించారు. ఆ సంఘటన జరిగే సమయానికి ఆమె ఐదు నెలల గర్భవతి అని అప్పట్లో రిపోర్టులు వచ్చాయి. కొంతమంది రెండు నెలల గర్భవతి అని చెబితే, మరి కొంతమంది ఏడు నెలల గర్భవతి అని చెప్పారు. అయితే సీనియర్ డైరెక్టర్ నందం హరిశ్చంద్ర రావు కొన్ని రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చనిపోయేనటాకిి సౌందర్య ఐదు నెలల గర్భవతి అని ధ్రువీకరించారు.ఆయనకు సౌందర్య కుటుంబంతో ఎంతో మంచి అనుబంధం ఉంది.

24
విమానం ఎక్కిన అయిదు నిమిషాలకే

సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యానారాయణ. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించారు. ప్రతి సినిమాలో కూడా అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1999లో సూర్యవంశం సినిమాలో అమితాబచ్చన్ తో ఆమె కలిసి నటించారు. ఆ పాత్రకు జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. 32 ఏళ్ల వయసులోనే అకాల మరణం మాత్రం ఆమె అభిమానులను ఎంతో బాధకు గురి చేసింది. సౌందర్య బెంగళూరు సమీపంలోని జక్కూర్ ఎయిర్ స్ట్రిప్ నుండి విమానం ఎక్కారు. ఆమెతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్, బిజెపి కార్యకర్త రమేష్ కదమ్, పైలెట్ జాయ్ ఫిలిప్స్ ఆ విమానంలో ఉన్నారు. 

భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడానికి కరీంనగర్‌కి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఉదయం 11:05 గంటలకు టేకాఫ్ అయిన విమానం ఐదు నిమిషాలకే కూలిపోయింది. విమానం దాదాపు 150 అడుగుల ఎత్తుకు ఎగిరాక ఎడమవైపుగా వంగిపోయి ఒక యూనివర్సిటీలోని క్యాంపస్ లో కూలిపోయి మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న వారంతా గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. విషయం తెలిసిన వెంటనే అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి, ఒక కేంద్రమంత్రి జక్కుర్ కు చేరుకున్నారు. అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి కూడా సౌందర్య మరణం పట్ల ఎంతో బాధపడ్డారు.

34
కొన్ని నెలల ముందే పెళ్లి

సౌందర్య చనిపోవడానికి కొన్ని నెలల ముందే 2003లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రఘును వివాహం చేసుకున్నారు. 32 ఏళ్ల వయసులో తల్లి అయ్యేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లేటప్పుడు ఆమెకు ఐదు నెలల గర్భమని తెలుస్తోంది. ఎంతోమంది నటీనటులకు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆమెతో జయం మనదేరా సినిమాలో నటించిన సీనియర్ నటి నిర్మల కూడా ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో ధృవీకరించారు. తల్లి కావాలని సౌందర్య ఎంతో ఆశపడిందని కానీ ఆ కోరిక తీరకముందే మరణించిందని ఆమెతో నటించిన ఎంతోమంది బాధపడ్డారు.

44
ఆస్తి గొడవలు

సౌందర్య మరణించిన 20 ఏళ్ల తర్వాత ఆమె గురించి మళ్లీ గత ఏడాది వార్తలు వచ్చాయి. ఆస్తి విషయంలో మోహన్ బాబుకు సౌందర్యకు గొడవలు ఉన్నాయని.. మోహన్ బాబు సౌందర్యను మోసం చేశాడని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు రా సాయి. దీనిపై సౌందర్య భర్త రఘు వివరణ ఇస్తూ ఒక లేఖను కూడా విడుదల చేశారు. హైదరాబాదులోని సౌందర్య ఆస్తి గురించి మోహన్ బాబుకు లింక్ చేస్తూ వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన చెప్పారు. గత పాతికేళ్లుగా మోహన్ బాబుతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం రఘు బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories