సుశాంత్ కేసులో మరో ట్విస్ట్‌: టాప్ హీరో కూతురితో సుశాంత్ ప్రేమాయణం

First Published Aug 21, 2020, 10:43 AM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సుశాంత్‌ది ఆత్మ హత్య కాదు హత్య అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర విషయం తెర మీదకు వచ్చింది. సుశాంత్ ఓ టాప్ హీరో కూతురితో ప్రేమాయణం నడిపినట్టుగా బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయాన్ని సుశాంత్ స్నేహితుడు శామ్యూల్‌ హాకి వెల్లడించాడు.

ఇటీవల సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ స్నేహితుడు శామ్యూల్ హాకిప్ తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా సంచనల విషయాలు వెల్లడించాడు. కేదార్‌నాథ్‌ సినిమా ప్రమోషన్‌ సమయం నుంచి సుశాంత్, సారాను ప్రేమలో ఉన్నట్టుగా ఆయన వెల్లడించాడు.
undefined
సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ముంబైలోని తన ఇంట్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు నిర్దారించినా సూసైడ్‌ నోట్‌ను మాత్రం దొరకలేదు.
undefined
శామ్యూల్‌ తన పోస్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించాడు. సుశాంత్ తన జీవితంలో ప్రతీ విషయాన్ని తనతో పంచుకునేవాడని శామ్యూల్‌ వెల్లడించాడు. అదే సమయంలో సారా అలీఖాన్‌తో రిలేషన్‌ గురించి కూడా చెప్పాడని, సారా కారణంగానే తనతో బ్రేకప్‌ అయినట్టుగా కూడా ఆయన చెప్పాడని శామ్యూల్ వెల్లడించాడు.
undefined
శామ్యూల్‌ తన పోస్ట్‌లో `కేధార్‌నాథ్ ప్రమోషన్‌ సమయంలో సుశాంత్, సారాలు ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలుసు. వారు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వారిద్దరు ఒకరంటే ఒకరు ఎంతో గౌరవించుకునేవారు. లాంటి బంధం ఈ రోజుల్లో మనం అసలు చూడలేం` అన్నాడు.
undefined
అయితే సుశాంత్‌ తదుపరి చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవటంతో ఆ తరువాతి పరిణామాల నేథప్యంలో సారా, సుశాంత్‌కు బ్రేకప్‌ చెప్పేసింది. అయితే సారా బ్రేకప్ చెప్పడానికి బాలీవుడ్ మాఫియా ఒత్తిడి కూడా కారణం అయి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు శామ్యూల్‌.
undefined
ఇటీవల రియా చక్రవర్తి సుశాంత్ సోదరిపైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై కూడా శామ్యూల్ స్పందించాడు.
undefined
రియా కారణంగా సుశాంత్, ఆయన సోదరి మధ్య గొడవలు జరిగిన మాట వాస్తవమే అన్నాడు శామ్యూల్‌. ఆ సమయంలో తాను ఇంట్లోనే ఉన్నట్టుగా వెల్లడించాడు. అయితే ఆ గొడవ కారణం ఏంటి అన్నది అప్పట్లో నాకు తెలియదు. ప్రస్తుతం వార్తల్లో చూసిన తరువాతే ఆ గొడవకు కారణం ఏంటో నాకు అర్థమైంది. అప్పట్లో గొడవ గురించి నేసు సుశాంత్‌ను గానీ, ఆయన సోదరిని గానీ ఏం అడగలేదని చెప్పాడు శామ్యూల్‌.
undefined
ఇటీవల సుప్రీం కోర్టును సుశాంత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై మహారాష్ట్ర పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
undefined
ఇప్పటికే కేసు విచారణ ప్రారంభించిన సీబీఐ ముంబై పోలీసుల నుంచి అన్న పత్రాలను స్వాదీనం చేసుకుంది. విచారణ వేగవంతం చేసింది.
undefined
click me!