హీరోలు చెడ్డీ చూపిస్తారు.. మేం బ్రా చూపించకూడదా..?: నెటిజెన్‌కు టాలీవుడ్‌ నటి కౌంటర్‌

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో హల్‌ చల్‌ చేసే టాలీవుడ్‌ (బెంగాళీ ఫిలిం ఇండస్ట్రీని కూడా టాలీవుడ్‌ అంటారు) నటి స్వస్తికా ముఖర్జీపై ట్రోలింగ్‌ జరుగుతోంది. తన తాజా చిత్రం తషర్‌ ఘ్వర్‌ ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆమె బ్రా స్ట్రాప్ కనిపించటంపై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై స్వస్తిక గట్టిగానే రిప్లై ఇచ్చింది.

Dil Bechara actor Swastika Mukherjee trolled for flaunting bra straps; here's how she replied
బోల్డ్‌ బెంగాళీ బ్యూటీ స్వస్తిక ముఖర్జీ ఇటీవల ట్రోలింగ్ బారిన పడ్డారు. సోషల్ మీడియాలో హాట్‌ ఫోటోలను షేర్ చేసి ఈమెను తాజా సినిమా ప్రమోషన్‌ విషయంలో పలువురు నెటిజెన్‌లు ప్రశ్నించారు.
Dil Bechara actor Swastika Mukherjee trolled for flaunting bra straps; here's how she replied
త్వరలో తాషర్‌ గవ్ర్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది స్వస్తిక. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఈ బ్యూటీ బ్రా పట్టీలు కనిపించేలా పోజ్‌ ఇవ్వటం చర్చనీయాంశమైంది.

ఈ సందర్భంగా ఓ నెటిజెన్‌ ఆమెను అలా బ్రా కనిపించేలా స్టిల్‌ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్ని ప్రశ్నించాడు. `దర్శకుడు అలా ఎందుకు చూపించాడో తెలుసుకోవాలని ఉంది. అలా చూపించడానికి కథకు సంబంధం ఉందా?` అంటూ కామెంట్ చేశాడు.
అయితే అందుకు సమాధానం ఇచ్చిన స్వస్తిక ఘాటుగా రిప్లై ఇచ్చింది. హీరోలు చెడ్డీలు కనిపించేలా స్టిల్‌ ఇచ్చినప్పుడు మీరు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగలేదు. అంటూ ఆమె కౌంటర్‌ ఇచ్చింది. తన సమాధానంతో పాటు అక్షయ్‌ కుమార్‌, జాన్‌ అబ్రహంలు తమ డ్రాయర్‌ కనిపించేలా ఇచ్చిన స్టిల్‌ను ఆమె షేర్ చేసింది.
`మేమెప్పుడైనా దర్శకులు హీరోల లోదుస్తులు ఎందుకు చూపిస్తున్నారు అని అడిగామా..? మాకు అలాంటి ఆలోచన కూడా రాదు. కానీ మహిళ లో దుస్తులు మాత్రం ఎప్పుడూ చర్చనీయాంశమే. అందులో ప్రత్యేకత ఏం లేదు ` అంటూ ట్వీట్ చేసింది స్వస్తిక.
అయితే స్వస్తిక సమాధానంపై కూడా చర్చ జరుగుతోంది. దేశీ బాయ్స్ సినిమాలో సన్నివేశాల గురించి మాకు తెలుసు, కానీ ఈ సినిమా పోస్టర్‌లో కావాలనే బ్రా చూపించినట్టుగా ఉంది. అది సినిమా థీమ్‌లో భాగమా అని మాత్రమే మా ప్రశ్న అంటూ రిప్లై ఇచ్చారు.
.అయితే స్వస్తిక మాత్రం తన వాదనను బలంగా వినిపిస్తోంది. మేల్ యాక్టర్స్‌ ఇన్నర్‌వేర్‌లో కనిపించటం ఎప్పుడు చర్చనీయాంశం కాదు, కానీ స్త్రీ విషయంలో అలా కాదు. మహిళల బ్రా స్ట్రాప్‌ కనిపిస్తే కూడా అది పెద్ద న్యూస్‌. ఇలాంటి భావాలకు స్వస్తి పలకాలి.అంటూ ఆమె ఆగ్రమం వ్యక్తం చేసింది.

Latest Videos

vuukle one pixel image
click me!