బాలుగారికి 'కరోనా'కి కారణం నేను కాదు, సైబర్ కేసు పెడతా!

First Published Aug 21, 2020, 10:29 AM IST

తెలుగు పరిశ్రమలో కరోనా వైరస్ ధడ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన కొంత మంది ప్రముఖులు పడగా తాజాగా టాలీవుడ్ సింగర్స్ సునీత,మాళవిక, ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారు ఓ టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అందులోనే వారికి కరోనా సోకినట్టుగా సమాచారం. ప్రస్తుతం వీరు హోం క్వారంటైన్ లో ఉండి డాక్టర్ల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా సోకటానికి మాళవిక కారణం అంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో మాళవిక కాస్త సీరియస్ గానే స్పందించారు. ఆ వివరాలు చూద్దాం.

అయితే ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో బాలుకి కరోనా సోకడానికి కారణం సింగర్ మాళవిక అనే వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ఆ రూమర్స్ పై క్లారిటీ ఇస్తూ వీడియో వీడియో విడుద చేసింది సింగర్ మాళవిక.
undefined
నా గురించి ఒక ఫేక్ వాట్సాప్ మెసేజ్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంది. అందులో ఏం ఉందంటే.. నేను కరోనా టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వచ్చిన తరువాత కూడా ఒక మ్యూజిక్ ఈవెంట్‌లో పాల్గొన్నానని.
undefined
అక్కడ నావల్ల మ్యూజిషియన్స్, సిబ్బంది అలాగే ఆ షోకి వచ్చిన ఎస్పీ బాలుకి కరోనా సోకిందని నాతో పాటు మా సిస్టర్ కూడా ఆ ఈవెంట్‌లో పాల్గొన్నట్టు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. ఈ మెసేజ్ ద్వారా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
undefined
వాటిపై నేను క్లారిటీ ఇవ్వదల్చుకున్నాను. ఎస్పీబీ స్పెషల్ ఎపిసోడ్స్.. జూలై 30, 31న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగింది. జూలై 30 చాలా మంది సింగర్స్ పార్టిసిపేట్ చేశారు.
undefined
నేను పార్టిసిపేట్ చేసింది జూలై 31న. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ ఈవెంట్‌లో నేను పాల్గొన్నాను. నాకు బాగా గుర్తింది.. ఆగష్టు 1న బాలుగారు మెసేజ్ చేశారు.
undefined
నేను చాలా అలిసిపోయాను. వరుసగా షూటింగ్ ఉండటం వల్ల టైడ్ అయ్యానని మెసేజ్ పెట్టారు. ఆగష్టు 5న ఆయన కరోనా అని వీడియో ద్వారా తెలిపారు.
undefined
అదే టైంలో కొంతమంది మ్యుజిషియన్స్‌కి కరోనా సోకిందని తెలిసింది. ఆ షూట్‌లో నేను పాల్గొన్నాను కాబట్టి.. నేనూ టెస్ట్ చేయించుకున్నా.. నాతో పాటు చాలా మంది కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అయితే నాకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ ఆగష్టు 8 వచ్చింది.
undefined
షూటింగ్ జరిగింది జూలై 31న. అంతకు ముందు నాకు కరోనా వచ్చే అవకాశం లేదు. షూటింగ్ వెళ్లడానికి ముందు గత ఐదు నెలలుగా మేం ఇంట్లోనే ఉంటున్నాం.
undefined
మా ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారు. వాళ్లకు కరోనా రాకూడదని బయటకు వెళ్లడం లేదు. మా ఆయన 5 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. నాకు 5 నెలల పాప ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ 5 నెలల తరువాత నేను ఆ ప్రోగ్రామ్‌కి వెళ్లాను అని చెప్పుకొచ్చారామె.
undefined
దయచేసి అర్థం చేసుకోండి.. ఆగష్టు 5 తరువాత మాకు అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకున్నాం తప్పితే అంతకు ముందు నేను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నాను. అయితే నాకు కరోనా వచ్చిన తరువాత మా ఇంట్లో మా అమ్మ, నాన్న, పాపలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
undefined
వాళ్ల రిపోర్ట్ ఆగష్టు 9న వచ్చింది. మా నాన్న ఇప్పుడు హాస్పటల్‌లో ఉన్నారు. మేం కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం.. బాధలో ఉన్నాం.. దయచేసి నాపై దుష్ప్రచారం చేయవద్దు.
undefined
బాలుగారి ఫ్యామిలీ కూడా బాధలో ఉంది. ఇలాంటి సందర్భంలో అందరి బ్లెస్సింగ్ కావాలి. నాపై తప్పుడు మెసేజ్‌ని ప్రచారం చేసిన వాళ్ల వివరాలను సేకరించి సైబర్ క్రైమ్‌కి రిపోర్ట్ చేస్తున్నా.
undefined
బాధలో ఉన్న సమయంలో నన్ను నా కుటుంబంతో దుష్ప్రచారం చేయడం దారుణం.. దయచేసి మమ్మల్ని బాధపెట్టొద్దు. ఈ ఫేక్ మెసేజ్‌ని సర్క్యూలేట్ చేయొద్దు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సింగర్ మాళవిక.
undefined
గత కొంత కాలంగా కరోనాతో తీవ్ర అనారోగ్యంతో ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం బాధ ప‌డుతున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 12 మంది స‌భ్యులున్న ప్ర‌త్యేక డాక్టర్ల టీమ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బాలు చికిత్స పొందుతున్నారు. ప్ర‌తీ రోజూ సాయింత్రం బాలుకి సంబంధించిన హెల్త్ బులిటెన్ విధిగా విడుద‌ల చేస్తన్నారు. అంతేకాదు బాలు ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌న్నీ త‌మిళ నాడు ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తోంది.
undefined
ఇక తాజా అప్డేట్ విషయానికి వస్తే.... బాలు కోసం విదేశాల నుంచి డాక్టర్లు ర‌ప్పించార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం బాలు వెంటిలేట‌ర్‌పైనే ఉన్నారు. వారం రోజులుగా ఆయ‌నకు కృత్రిమ శ్వాసే అందిస్తున్నారు. ప్ర‌స్తుతం బాలు ఆరోగ్య స్థితి ప్ర‌మాద‌క‌రంగానే ఉన్నా, చేయి దాటి పోలేద‌ని చెప్తున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆఫీసు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు బాలు క్షేమ స‌మాచారాలు సేక‌రిస్తోంది.
undefined
click me!