సూర్యవంశం కుర్రాడు.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా? మేక్‌ ఓవర్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

First Published | Dec 25, 2024, 2:09 PM IST

చైల్డ్‌ ఆర్టిస్టులుగా వెండి తెరకు పరిచయమై ఆ తర్వాత హీరోలుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడు ఒకరు. సూర్యవంశం సినిమాలో వెంకటేష్‌ కొడుకు పాత్రలో కనిపించిన ఈ బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు.? ఏం చేస్తున్నాడో తెలుసా.. 
 

వెంకటేష్‌ డ్యూయల్‌ రోల్‌లో నటించిన సూర్యవంశం సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మీనా హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. వెంకీ అల్టిమేట్ యాక్టింగ్‌, సెంటిమెంట్ సన్నివేశాలు ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. ఇక ఈ సినిమాలో చిన్న వెంకటేష్‌ కుమారిడిగా నటించిన కుర్రాడు గుర్తున్నాడా.? 
 

సుమారు 25 సినిమాల్లో నటించిన ఆనంద్‌, తర్వాత స్టడీ కోసం సినిమాలకు దూరమయ్యాడు. 1995లో బాల రామాయణం సినిమా ద్వారా ఆనంద్‌ తొలిసారి వెండి తెరపై కనిపించాడు. కాగా ఆనంద్‌ మళ్లీ చాలా ఏళ్ల తర్వాత హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. 2023లో నిదురించు జహాపన సినిమాతో ప్రేక్షకులను హీరోగా పలకరించాడు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఆనంద్‌. 
 


ఒకప్పుడు చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా రాణించిన ఆనంద్‌ ప్రస్తుతం పూర్తి మేకోవర్‌ మారాడు. స్టైలిష్‌ లుక్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రియరాగలు మూవీలో ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఇక 2012లో ఆనంద్‌ హైదరాబాద్‌లోని సీఎమ్‌ఆర్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆనంద్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తున్నాడు. దీంతో ఒకప్పుడు ఆనంద్‌ను చూసిన అభిమానులు ప్రస్తుత మేకోవర్‌ను చూసి షాక్‌ అవుతున్నారు. 
 

Latest Videos

click me!