Allu Arjun, Pushpa 2: The Rule, 3D
భారీ అంచనాల నడుమ, భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ పుష్ప 2 వారంలోనే రికార్డు బ్రేక్ చేసి దూసుకుపోయిన సంగతి తెలిసిందే. మొదటి వారంలోనే గ్రాస్ 1000 కోట్లను రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది. దాదాపు రూ.450 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. . ఇప్పటికే స్త్రీ 2, జవాన్, కల్కి 2898 ఏడీ, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల రికార్డులను గల్లంతు చేసిన పుష్ప 1600 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పుడు మరోసారి రికార్డ్ లను క్రియేట్ చేసేందుకు 3D వెర్షన్ లో థియోటర్స్ లోకి దిగుతోంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దుసుకుపోతోంది.నార్త్ బెల్ట్ లో ఈ సినిమా రూ.700 కోట్లు వసూలు చేసింది. దీంతో నార్త్ లో ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. హిందీ ఆడియన్స్ ఈ సినిమాను మరింత ఎంజాయ్ చేసేలా ఇప్పుడు త్రీడీ వెర్షన్ దింపారు.
వాస్తవానికి ఈ చిత్రాన్ని మొదట ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో విడుదల చేయాలనుకున్నారు. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల అప్పుడు త్రీడీలో విడుదల చేయలేకపోయారు. తాజాగా హిందీ భాషలో త్రీడీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో చిత్ర టీమ్ కి బాలీవుడ్ అగ్ర నిర్మాణసంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ అభినందనలు తెలిపింది.
అల్లు అర్జున్, రష్మిక ఆ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ థాంక్స్ చెప్పారు. ‘పాత రికార్డులను ఈ చిత్రం బద్దలుకొడుతోంది. ఎన్నో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. చరిత్రను తిరగరాస్తున్నందుకు ‘పుష్ప2’ టీమ్‌కు అభినందనలు. ఇది ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్’ అని నిర్మాణసంస్థ పేర్కొంది. మీ అభిమానానికి ధన్యవాదాలు అని అల్లు అర్జున్ ఆ పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు
సమష్టి కృషి వల్లనే ఈ చిత్రం ఇంతటి విజయం సాధించిందన్నారు. మీ ప్రేమాభిమానాలు మనసును హత్తుకున్నాయన్నారు. రష్మిక స్పందిస్తూ.. మీ నుంచి ప్రశంసలు రావడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ‘పుష్ప2’ ఇప్పటివరకూ ‘కేజీయఫ్2’ (రూ.1250 కోట్లు), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రూ.1,387 కోట్లు) ఆల్‌టైమ్ కలెక్షన్లు దాటేసిన ‘పుష్ప2’.. ‘బాహుబలి 2’ (రూ.1810 కోట్లు) వసూళ్లను దాటే దిశగా దూసుకెళ్తోంది. ‘దమ్ముంటే పట్టుకోరా’ సాంగ్‌ను ‘పుష్ప 2’ టీమ్ తాజాగా విడుదల చేసింది.
అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా నాలుగు నెలలు ఆలస్యంగా థియేటర్‌లలో కు వచ్చింది. అయినా సరే పుష్ప 2 మీదున్న హైప్ కొద్దిగా కూడా తగ్గలేదు.. అదే ఊపులో సినిమా ఇప్పుడు రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తోంది.