రోజు రోజుకి పుష్ప 2 హంగామా పెరుగుతోంది. రోజుకొక న్యూస్ తో పుష్ప 2 సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు పుష్ప 2 నుంచి దేవిశ్రీ ప్రసాద్ ని పాక్షికంగా తప్పించారు అనే న్యూస్ పై చర్చ జరిగింది. బిజియం కోసం దేవీశ్రీని కాకుండా తమన్, సామ్ సీఎస్, అంజనీష్ లోకనాథ్ లని తీసుకున్నారు.