గుట్టుగా మొదలైన శోభిత-నాగ చైతన్యల వివాహ వేడుకలు, పెళ్లి ఎక్కడంటే?

First Published | Oct 21, 2024, 2:11 PM IST

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఈ మేరకు శోభిత సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇక పెళ్లి వేదిక ఎక్కడంటే?
 

Naga Chaitanya-Sobhita Dhulipala Marriage


అక్కినేని వారి ఇంట పెళ్లి బాజా మోగింది. నాగ చైతన్య పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. శోభిత ధూళిపాళ్ల ఇంస్టాగ్రామ్ లో తన పెళ్లి వేడుకల ఫోటోలు షేర్ చేసింది. 
 

Naga Chaitanya

నాగ చైతన్య తాజాగా ఓ ఫోటో షేర్ చేశాడు. సూపర్ స్టైలిష్ గా నాగ చైతన్య, శోభిత సదరు ఫోటోలో దర్శనమిచ్చారు. సదరు ఫోటోకి రొమాంటిక్ కోట్ కూడా జోడించాడు. ఈ ఫోటో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఒకింత ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి. నాగ చైతన్య సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా ఉండరు. అయితే పెళ్లి పై ఆయన ఫోటో పోస్ట్ చేయడం ద్వారా హింట్ ఇచ్చారని, శోభిత ప్రకటనతో అర్థం అవుతుంది. 

శోభిత ధూళిపాళ్ల ఇంట్లో మొదలైన పెళ్లి వేడుకల ఫోటోలు తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో ఆమె పంచుకున్నారు. 'గోధుమరాయి పసుపు దంచడం' అని సదరు ఫోటోలకు క్యాప్షన్ జోడించారు. హిందూ వివాహ సాంప్రదాయంలో పసుపు దంచడం అతి ముఖ్యమైన ఆచారంగా ఉంది. ఈ కార్యక్రమంతో శోభిత-నాగ చైతన్య పెళ్లి వేడుకలు మొదలైనట్లు తెలుస్తుంది. 


Naga Chaitanya-Sobhita Dhulipala Marriage


నాగ చైతన్య పెళ్లి గురించి ఎలాంటి సమాచారం లేదు. 2025 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారంటూ పుకార్లు వినిపించాయి. విదేశాల్లో వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే వైజాగ్ లో వివాహం జరగనుందట. అక్కడే పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారట. 

శోభిత వైజాగ్ లో చదువుకోవడం విశేషం. ఇక రెండేళ్లకు పైగా నాగ చైతన్య-శోభిత రిలేషన్ లో ఉన్నారు. అప్పుడప్పుడు వీరి ప్రైవేట్ ఫోటోలు లీక్ అవుతూ ఉండేవి. ఎఫైర్ రూమర్స్ ని పలుమార్లు ఈ జంట ఖండించారు. సడన్ గా ఆగస్టు 8న నిశ్చితార్థం జరుపుకుని షాక్ ఇచ్చారు. నాగార్జున కొత్త కోడలు శోభిత ధూళిపాళ్లకు అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికాడు. 

Naga Chaitanya-Sobhita Dhulipala Marriage

శోభిత-నాగ చైతన్యల వివాహం నేపథ్యంలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పట్టు చీరలో ఉన్న శోభిత ట్రెడిషనల్ లుక్ వైరల్ అవుతుంది. మొత్తంగా ప్రేమికులుగా ఉన్న ఈ సెలబ్రిటీ కపుల్ పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. 

శోభిత ధూళిపాళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలిలో పుట్టిన తెలుగు అమ్మాయి. ఆమె మోడలింగ్ చేశారు. ముంబైలో ఆమె కెరీర్ మొదలైంది. బాలీవుడ్ లో శోభిత ఎక్కువ చిత్రాలు చేసింది. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలు చేసింది. చిత్రీకరణ దశలో ఉన్న గూడచారి 2లో సైతం శోభిత నటిస్తుట్లు సమాచారం. మంకీ మ్యాన్ టైటిల్ తో తెరకెక్కిన ఓ హాలీవుడ్ చిత్రం లో కూడా ఆమె నటించారు. 
 

ఇక నాగార్జున పెద్ద కుమారుడైన నాగ చైతన్యకు ఇది రెండో వివాహం. ఆయన 2017లో హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. దాదాపు నాలుగేళ్ళ వైవాహిక జీవితం అనంతరం మనస్పర్థలతో విడిపోయారు. 2021లో సమంత-నాగ చైతన్య అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నారు. 

Naga Chaitanya

మరోవైపు సమంత సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. ఆమె నటించిన వెబ్ సిరీస్ హనీ బన్నీ విడుదలకు సిద్ధం అవుతుంది. ఆ సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు ఉన్నాయి. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి

Latest Videos

click me!