నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

First Published | Oct 21, 2024, 12:55 PM IST

ప్రతి సోమవారం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. 8వ వారానికి గాను 6 మంది టాప్ కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్లు సమాచారం అందుతుంది. 
 

ఈ వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా, సెల్ఫ్ ఎలిమినేషన్ తో నాగ మణికంఠ తప్పుకున్నాడు. అనారోగ్య కారణాలతో నాగ మణికంఠ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 
 

Bigg boss telugu 8

నాగ మణికంఠ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అతడు ప్రతివారం దాదాపు నామినేషన్స్ లో ఉండేవాడు. ప్రేక్షకులు ఆయన్ని ఆదరించారు. నాగ మణికంఠకు పెద్ద మొత్తంలో ఓట్లు పడేవి. ఓటింగ్ లో నాగ మణికంఠ ఖచ్చితంగా టాప్ 3లో ఉండేవాడు. నాగ మణికంఠ ఎలిమినేషన్ పై ఆడియన్స్ లో ఒకింత అసహనం నెలకొంది. స్క్రిప్టెడ్ షో అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుండి బేబక్క, శేఖర్ బాషా, అభయ్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, మణికంఠ ఎలిమినేట్ అయ్యారు. ఇక 8వ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్స్ ఫోటోలు అతికించి ఉన్న దిష్టి బొమ్మలకు కుండలు తగిలించి వాటిని బ్రేక్ చేయాలి. తగు కారణాలు చెప్పి ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. 



ఎలిమినేషన్ ప్రక్రియలో యధావిధిగా వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రేరణ-విష్ణుప్రియ వాదులాడుకున్నారు. ఇక పృథ్విరాజ్, రోహిణి ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. దీంతో భారీ ఫైట్ చోటు చేసుకుంది. నిఖిల్-విష్ణుప్రియ సైతం వాదనకు దిగారు. నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన అనంతరం... బిగ్ బాస్ లిస్ట్ ప్రకటించారు. నయని పావని, మెహబూబ్, విష్ణుప్రియ, పృథ్విరాజ్, ప్రేరణ, నిఖిల్  నామినేట్ అయ్యారట. 

నయని పావని, మెహబూబ్ రాయల్ క్లాన్ సభ్యులు. ఐదు వారాల అనంతరం వీరిద్దరూ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్స్ నుండి ఒక్కరు కూడా ఎలిమినేట్ కాలేదు. కాబట్టి వీరిలో ఒకరు ఇంటిని వీడే అవకాశం లేకపోలేదు. అయితే మెహబూబ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అతనికి ఓట్లు భారీగా పడుతున్నాయి. నయని పావని ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. 


మిగిలిన నలుగురు ఓజీ క్లాన్ సభ్యులు. వీరిలో నిఖిల్ బాగా స్ట్రాంగ్. అతడు ఫస్ట్ వీక్ నుండి సత్తా చాటుతున్నాడు. సోనియా వెళ్ళిపోయాక గేమ్ మరింత మెరుగైంది. నిఖిల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. విష్ణుప్రియ, ప్రేరణ సైతం ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్స్. ముఖ్యంగా ప్రేరణ గేమ్ పట్ల ఆడియన్స్ లో పాజిటివ్ ఒపీనియన్ ఉంది. 

8వ వారం కూడా ఓజీ క్లాన్ సభ్యుడు ఎలిమినేట్ అయితే అది పృథ్విరాజ్ కావచ్చు. పృథ్విరాజ్ కి పెద్దగా ఫ్యాన్ బేస్ లేదు. గేమ్ లో ఓవర్ అగ్రెషన్ చూపించడం, బూతులు మాట్లాడటం అతడికి మైనస్. విష్ణుప్రియతో లవ్ ట్రాక్ నడుపుతున్నాడు. కాగా నాగార్జున అతడికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కేవలం గడ్డం తీసేస్తే... నేరుగా 10వ వారంలో అడుగుపెట్టవచ్చు అన్నాడు. 

మూడు వారాలు నామినేషన్స్ లో లేకుండా మినహాయింపు పొందే అవకాశం పృథ్విరాజ్ కి వచ్చింది. కానీ పృథ్విరాజ్ ఆ ఆఫర్ రిజెక్ట్ చేశాడు. గడ్డం తీసేది లేదు అన్నాడు. ఒకవేళ ఈ వారం అతడు ఎలిమినేట్ అయితే, భారీ మూల్యం చెల్లించినట్లు అవుతుంది. గడ్డం తీసేసి ఉంటే బాగుండేదని అతడు పశ్చాత్తాప పడటం ఖాయం. మరి ప్రేక్షకులు ఏం తేల్చుతారో చూడాలి. 

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు 8 ఏడు వారాలు పూర్తి చేస్తున్న నేపథ్యంలో... సగం ఆట ముగిసినట్లే. మరో 8 వారాల గేమ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికీ టైటిల్ ఫేవరేట్ ఎవరనే అవగాహన రాలేదు. ఒక్కరు కూడా ప్రేక్షకులను అన్ని విధాలా మెప్పించలేకపోతున్నారు. నిఖిల్, ప్రేరణ పేర్లు టైటిల్ రేసులో ఉన్నట్లు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి

Latest Videos

click me!