నాగార్జున కోట్లు పెట్టి కొన్న కార్లన్నీ వేస్ట్, రాజమౌళి అద్భుతమైన ఐడియా..మహేష్ బాబులా వాళ్ళని నిందించకుండా

First Published Oct 21, 2024, 2:09 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు. హాలీవుడ్ ప్రముఖులు సైతం రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత రాజమౌళి రేంజ్ మారిపోయింది. ఇదిలా ఉండగా రాజమౌళికి సామాజిక స్పృహ కూడా ఉంది.

దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు. హాలీవుడ్ ప్రముఖులు సైతం రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత రాజమౌళి రేంజ్ మారిపోయింది. ఇదిలా ఉండగా రాజమౌళికి సామాజిక స్పృహ కూడా ఉంది. గతంలో రాజమౌళి.. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణకు మద్దతు కూడా తెలిపారు. 

ప్రజల్లో చైతన్యం పెంచడం కోసం రాజమౌళి సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు. అందులో భాగంగా సెలెబ్రిటీలని అతిథులుగా పిలిచి టాక్ షో నిర్వహించారు. రాజమౌళి టాక్ షోకి చాలా మంది సెలెబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు. వారిలో నాగార్జున కూడా ఉన్నారు. నాగార్జునతో రాజమౌళి హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య గురించి చర్చించారు. హైదరాబాద్ ట్రాఫిక్ వల్ల మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అని రాజమౌళి నాగార్జునని ప్రశ్నించారు. నాగార్జున సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. 

Latest Videos


ఈ ప్రశ్నకు నేను కాస్త హిస్టరీలోకి వెళ్లి సమాధానం చెబుతా అని నాగార్జున అన్నారు. 1963 నుంచి మా ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉంటోంది. అప్పుడు నేను చిన్న పిల్లాడిని అయినప్పటికీ ట్రాఫిక్ పరిస్థితులు గుర్తున్నాయి. ఇక 1970లలో మాకు ప్రీమియర్ పద్మిని కారు ఉండేది. పంజాగుట్టలో ఫోర్త్ గేర్ వేస్తే ప్యారడైజ్ సర్కిల్ వరకు ఫోర్త్ గేర్ లోనే వెళ్ళేవాళ్ళం. ట్రాఫిక్ అంత తక్కువగా రోడ్లు ఫ్రీగా ఉండేవి. అప్పుడు నిజాం వేసిన సిమెంట్ రోడ్లు ఉండేవి. ఇక నేను డబ్బు సంపాదించడం మొదలు పెట్టాక మంచి స్పోర్ట్స్ కారు కొనాలి అనేది నా కోరిక. 1986లో ఒక స్పోర్ట్స్ కారు కొనుక్కున్నా. అప్పట్లో కంటిన్యూగా ఫోర్త్ గేర్ లో వెల్ళడం కుదర్లేదు కానీ.. అప్పుడు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బావుండేది. స్పోర్ట్స్ కారు అంటే వేగంగానే వెళ్ళాలి. అప్పుడే ఆ మజా ఉంటుంది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. ట్రాఫిక్ పెరిగే కొద్దీ స్పోర్ట్స్ కారు ఉన్నప్పటికీ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ లో మాత్రమే వెళ్లాల్సి వచ్చింది. 

2000 సంవత్సరం తర్వాత నాగార్జున పోష్ థయాన్ ఎస్యువి అనే ఖరీదైన కారు కొన్నారట. ఈ ట్రాఫిక్ లో ఆ కారు ఫస్ట్ గేర్ దాటి వెళ్ళేది కాదు అంటూ నాగార్జున నవ్వుతూ చెప్పారు. కేవలం 2 కిలోమీటర్లకు లీటర్ పెట్రోల్ మైలేజ్ ఇచ్చేది. నాలాగా నా కొడుకులకు కూడా కార్ల పిచ్చి పట్టుకుంది. ముఖ్యంగా నాగ చైతన్యకి అని నాగార్జున తెలిపారు. ఆ తర్వాత నేను బీఎండబ్ల్యూ కార్లు కొనడం ప్రారంభించాయి. ఈ కారులో ఉపయోగపడే టెక్నాలజి ఏంటంటే.. పక్కనే ఏదైనా కారు ఉంటే కుయ్ కుయ్ మని అరుస్తుంది. వెంటనే మా డ్రైవర్ అలెర్ట్ అవుతాడు. 

అంతకి మించి ఏ కారు కొన్నా ఉపయోగం లేదు. మీరు టాటా నానో కారు కొన్నా.. బీఎండబ్ల్యూ కారు కొన్నా హైదరాబాద్ ట్రాఫిక్ లో అన్ని కార్లు ఒక్కటే అని నాగార్జున అన్నారు. ట్రాఫిక్ సమస్య ఇంతలా పెరిగిపోవడానికి తాను ప్రభుత్వాలని నిందించను అని నాగార్జున తెలిపారు. కానీ పెరుగుతున్న వాహనాలకు తగ్గట్లుగా ప్లానింగ్ అయితే లేదు. ఫారెన్ లో మనకంటే చిన్న రోడ్లు ఉన్న నగరాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి మనకి ఉన్నంత ట్రాఫిక్ సమస్య లేదు అని రాజమౌళి అన్నారు. ఫారెన్ లో ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావడం అనేది ఒక ఫ్యాషన్ లాగా ఉంటుంది అని నాగార్జున బదులిచ్చారు. 

Bharat Ane Nenu

స్కూల్ పిల్లలు కూడా బైక్స్ లో వచ్చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు అని నాగ్ తెలిపారు. ఈ సమస్యకి రాజమౌళి ఒక అద్భుతమైన ఐడియా చెప్పగా నాగార్జున మద్దతు ఇచ్చారు. మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంలో లాగా ట్రాఫిక్ పోలీసులని కానీ, ప్రజలని కానీ నిందించకుండా జక్కన్న అద్భుతమైన ఐడియా ఇచ్చారు. ఎండలో కష్టపడే ట్రాఫిక్ పోలీసులకు జీతాలు పెంచడమే కాదు బోనస్ లు కూడా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. అదే విధంగా సరిగ్గా పనిచేయని ట్రాఫిక్ పోలీసులని శిక్షించాలి. అప్పుడు కొంతవరకు అయిన సమస్య పరిష్కారం అవుతుంది అని రాజమౌళి తెలిపారు. దీనికి నాగార్జున మద్దతు తెలుపుతూ ట్రాఫిక్ పోలీసులకు ఇన్సెంటివ్ ఇవ్వడానికి ప్రైవేట్ ఫండింగ్ మొదలు పెట్టాలి. మొట్టమొదట నేను నావంతు డబ్బు ఇస్తాను అని నాగార్జున తెలిపారు. 

click me!