రామ్ చరణ్ కు అనుకున్న ప్రాజెక్టులోకి హీరో సూర్య? కారణం

Published : Jul 20, 2024, 09:09 AM IST

తాను బిజి షెడ్యూల్స్ లో ఉన్నానని త్వరలోనే కలిపి చేద్దామని రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేసారట. 

PREV
111
రామ్ చరణ్ కు అనుకున్న ప్రాజెక్టులోకి  హీరో  సూర్య? కారణం
Suriya,Ram charan


ఒక హీరోతో అనుకున్న కథ మరొకరితో చేయటం ఇండస్ట్రీ చాలా కామన్ గా జరిగే విషయం. హీరో కు కథ నచ్చినా ప్రాజెక్టు పట్టాలు ఎక్కటానికి రకరకాల ఈక్వేషన్స్ మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. దాంతో ఆ సదరు హీరోతో కొంతకాలం జర్నీ చేసిన డైరక్టర్స్ ...తర్వాత వేరే హీరో దగ్గరకు వెళ్తారు. అలాంటప్పుడు ఫలానా హీరో ఓకే చేసి, డేట్స్ లేక ఆగిపోయిన ప్రాజెక్టు అనేది బాగా ప్లస్ అవుతుంది. వెంటనే పట్టాలు ఎక్కే అవకాసం కూడా ఉంటుంది.  అలా ఇప్పుడు రామ్ చరణ్ తో ఓకే అనుకున్న ప్రాజెక్టు ఒకటి తమిళ హీరో సూర్యతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.

211


గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్... కెరీర్  RRR సినిమా ముందు ... త‌ర్వాత అన్నట్లు ఉంది. రాజమౌళి తో ఆయన చేసిన సినిమా సూపర్ హిట్ అవటంతో చెర్రీ  రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఈయ‌న బిజినెస్,ఫ్యాన్ ఫాలోయింగ్  స్థాయి పెరిగిపోయింది. ఒక‌ప్పుడు న‌ట‌న రాదు అని విమ‌ర్శించిన వారి చేతే గ్లోబ‌ల్ స్టార్ అని అనిపించుకున్నాడు . మెగాస్టార్ కొడుకుగా సినిమా ఇండ‌స్ట్రీలోకి వచ్చిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ ఇవాళ చరణ్ తండ్రి చిరంజీవి అనిపించుకునే స్దాయికి వెళ్లిపోయాడు.  

311


రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ మూవీతో బిజీగా ఉన్నారు. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇంకా కొన్ని రోజుల షూటింగ్‌ మిగిలి ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత రామ్‌ చరణ్‌ నటిస్తున్న చిత్రం కావడంతో గేమ్‌ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంచలన డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం, దిల్‌ రాజు వంటి అగ్రనిర్మాత ఈ సినిమాకు నిర్మిస్తుండటంతో మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వస్తున్న లీక్డ్‌ ఫోటోలు, వీడియోలు మరింత ఆసక్తిని పెంచాయి.

411

  చరణ్‌ గేమ్ ఛేంజర్‌ మూవీ తన క్యారక్టర్ మేరకు షూటింగ్‌ పూర్తి చేసుకున్నాడు. నెక్ట్స్‌ 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. బుచ్చిబాబు-రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో భారీ పాన్‌ ఇండియా చిత్రంగా ఆర్‌సి16(#RC16) మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రీసెంట్ గానే పూజ కార్యక్రమాన్ని జరుపుకుంది. ఇక అతి త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా మొదలు కానుంది.  ఆర్‌సి16 మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.  మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడి వ్యవహరించనున్నారు. 

511

 వరస బిజిలో రామ్ చరణ్ ఉండటంతో తనకు కొన్ని కథలు నచ్చినా ముందుకు వెళ్లలేని పరిస్దితి. వాస్తవానికి  యువి క్రియేషన్స్‌తో రామ్ చరణ్ ఓ సినిమా చేయాలి. ఈ ప్రాజెక్టుకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తాడని గతంలో ప్రకటన కూడా ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అమాంతం క్రేజ్ మారడంతో ఈ చిత్రం పట్టాలెక్కలేదు. కానీ, యువి క్రియేషన్స్ మాత్రం చెర్రీ కోసం కొత్తగా కథలు వింటుంది. అయితే, యువి సంస్థ కన్నడ డైరెక్టర్ నర్తన్ (Narthan), రామ్ చరణ్ కాంబినేషన్‌లో మూవీ చేయడానికి సన్నాహాలు చేసింది. 

611

 నర్తన్ ప్రస్తుతం కథను సిద్ధం చేసి వినిపించాడు. ఈ కాంబినేషన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని అందరూ ఎక్సపెక్టే చేసారు.   అయితే ఆ ప్రాజెక్ట్ పై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకపోవడంతో ఆ వార్తలు రూమర్స్ గా నిలిచిపోయాయి. అయితే తాను బిజి షెడ్యూల్స్ లో ఉన్నానని త్వరలోనే కలిపి చేద్దామని రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేసారట. 

711


ఈ క్రమంలో నర్తన్  తన తదుపరి చిత్రాన్ని సూర్యతో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ప్రస్తుతం కన్నడ స్టార్‌ యశ్‌తో ‘టాక్సిక్‌’ అనే పాన్‌ ఇండియా చిత్రం నిర్మిస్తోంది. దాంతో   రామ్ చరణ్‌కు గతంలోనే చెప్పిన కథకు నర్తన్ మెరుగులు దిద్ది చెప్పాడా?లేదా మరేదైనా కొత్త స్టోరీని సిద్ధం చేసి చెప్పాడా అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
 

811
Suriya

సూర్య సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. అక్టోబరులో ‘కంగువ’తో థియేటర్లలో సందడి చేయనున్న ఆయన.. ఆ తర్వాత కార్తీక్‌ సుబ్బరాజు చిత్రంతో అలరించనున్నారు. కాగా, ఇప్పుడు సూర్య మరో కొత్త ప్రాజెక్ట్‌ కోసం చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘మఫ్టీ’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించారు కన్నడ దర్శకుడు నర్తన్‌ ..సూర్య తో సినిమా చేస్తే ఖచ్చితంగా మంచి క్రేజ్ వస్తుందనేది నిజం.

911


తెలుగులో సూర్యకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు అదిరిపోయే మార్కెట్ కూడా ఉంది. ఇక ఇప్పుడు కంగువ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సూర్య.  సూర్య 'కంగువ' సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది.  
 

1011
suriya kanguva


 కంగువ కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబందించిన పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  ఈ సినిమాలో సూర్య మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో మూడు పాత్రల కోసం సూర్య తనని తాను మార్చుకున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ఆయన నటించిన మూడు పాత్రలు ‘కంగువ’ కథకు అదిరిపోయే ట్విస్ట్‌ని తీసుకువస్తుందని తెలుస్తోంది. ‘కంగువ’ నుండి సూర్య  రెండు లుక్‌లు ఇప్పటికే రివీల్ అయ్యాయి.

1111

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా కనిపించబోతున్నాడు. తమిళంలో బాబీకి ఇదే మొదటి సినిమా. ఈ చిత్రంలో బాబీతో పాటు దిశా పటానీ కూడా కనిపించనుంది. ఈ చిత్రంలో నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, రాడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్, రవి రాఘవేంద్ర వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాలో ఓ అద్భుతమైన వార్ సీక్వెన్స్ ఉండనుంది. ఈ వార్ సీక్వెన్స్‌లో దాదాపు 10 వేల మంది వరకు ఉండబోతున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా కూడా 3డి ఫార్మాట్‌లో విడుదల కానుంది. సూర్య చివరిసారిగా అక్షయ్ కుమార్ నటించిన ‘సర్ఫిరా’ చిత్రంలో అతిధి పాత్రలో నటించాడు.

click me!

Recommended Stories