జెనీలియా.. `బొమ్మరిల్లు`, `ఢీ`, `రెడీ`, `సై`, `ఆరెంజ్, `శశరేఖ పరిణయం` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన హీరోయిన్. అల్లరి పిల్లలా, ఫుల్ ఎనర్జీతో, ఇన్నోసెంట్‌గా ఆమె చేసే యాక్టింగ్ అందరిని కట్టిపడేస్తుంది. అదే ఆమెని ఆడియెన్స్ కి దగ్గర చేసింది. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ఎక్కువగా నటించి మెప్పించిన జెనీలియా.. కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ మెరిసింది.