ఇప్పుడున్న స్టార్ హీరోలలో చాలా మంది ఆరాధించే నటుడు ఎన్టీఆర్. సీనియర్ల నుంచి జూనియర్లు, ఇతర భాషల వారు కూడా తారక్ నటనని, డాన్స్ లను ఆరాధిస్తుంటారు. ఆ మధ్య రంభ సైతం తారక్ డాన్స్ లను చూస్తుంటే మంత్రముగ్దురాలిని అయిపోతానని చెప్పింది. నయనతార, రష్మిక మందన్నా కూడా అదే చెప్పారు. అలాగే కృష్ణ సైతం ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఇలా తన అద్భుతమైన నటన, అత్యద్భుతమైన డాన్సులతో అందరిని ఫిదా చేస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు `దేవర`తో పాన్ ఇండియా ఆడియెన్స్ ని, గ్లోబల్ ఆడియెన్స్ ని ఫిదా చేయబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. ఇది సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది.