కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 29వ తేదీ)లో సుమిత్ర కోసం బాధపడుతాడు దశరథ. కార్తీక్, దశరథ మాటలను చాటుగా వింటుంది సుమిత్ర. కాశీని ఏం తప్పు చేశావని అడుగుతుంది స్వప్న. దీపను స్టేషన్ కి తీసుకెళ్తారు పోలీసులు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో దశరథను చూసి చాటుకు వెళ్తుంది సుమిత్ర. ఈ రోజు నా పెళ్లిరోజు.. నా భార్య నాతో రాలేదు. మా ఇద్దరి పేర్లపై అర్చన చేయండి అని పూజారితో చెప్తాడు దశరథ. పేర్లు చెప్తాడు కార్తీక్. ఈ పేర్లతో ఇంతకు ముందే అర్చన చేశాను అంటాడు పూజారి. సుమిత్ర వచ్చి ఉంటుందా అని కార్తీక్ ని అడుగుతాడు దశరథ. దీప అత్తను తీసుకురాలేదు కదా అని మనసులో అనుకొని.. వేరే జంటలకు కూడా ఈ పేర్లు ఉండొచ్చు కదా అంటాడు కార్తీక్. అయినా తనకు పెళ్లిరోజు గుర్తుందో లేదో భర్తనే వద్దనుకొని వెళ్లిన మనిషికి అదేం గుర్తుంటుంది లే అని బాధపడుతాడు దశరథ.
26
మా మమ్మీని ఏం చేశావ్?
ఇళ్లంతా వెతికాను ఎక్కడా లేదు. మా మమ్మీని ఏం చేశావు దీప అని అడుగుతుంది జ్యోత్స్న. వెతికాను అని నువ్వే చెప్తున్నావు కదా... ఇంకేంటి సుమిత్రమ్మ ఇక్కడ లేదు అంటుంది దీప. నాకు కోపం తెప్పించకు దీప. నీ పొగరు ఎలా దించాలో నాకు తెలుసు అంటుంది జ్యోత్స్న. నా జోలికి వస్తే నీ పొగరు ఎలా దించాలో కూడా నాకు బాగా తెలుసు అంటుంది దీప. దీపపైకి చెయ్యి ఎత్తుతుంది జ్యోత్స్న. చేయి దించు నా కోడలు పైకి చేయి ఎత్తితే మర్యాదగా ఉండదు అంటుంది కాంచన. నేను నీ మేనకోడలిని కాదా అంటుంది జ్యోత్స్న. కొట్టే పరిస్థితి వస్తే.. నా కోడలికంటే నువ్వు ఎక్కువ కాదు అంటుంది కాంచన.
36
పోలీస్ స్టేషన్ కి దీప
దీపను అరెస్ట్ చేయండి. స్టేషన్ కి తీసుకెళ్లి మీ స్టైల్లో అడిగితే నిజాలు అవే బయటకు వస్తాయని పోలీసులతో చెప్తుంది జ్యోత్స్న. ఎందుకు అరెస్ట్ చేస్తారు. దీప ఏం తప్పు చేసింది అని అడుగుతుంది కాంచన. మా మమ్మీని కిడ్నాప్ చేసిందని దీపపై నేను కంప్లెయింట్ చేశాను అని కాంచనతో చెప్తుంది జ్యోత్స్న. మా మమ్మీకి ఉన్న శత్రువు తనే. గతంలో మా డాడీని కూడా షూట్ చేసింది. కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. అని పోలీసులతో చెప్తుంది జ్యోత్స్న. కార్తీక్ ఫోన్ చేస్తుంది దీప. కానీ కార్తీక్ ఫోన్ ఎత్తడు. ఈ కంప్లెయింట్ విషయంలో మిమ్మల్ని విచారించాల్సి ఉంటుంది అని చెప్పి దీపను తీసుకెళ్తారు పోలీసులు.
మరోవైపు నువ్వేమైనా తప్పు చేశావా అని కాశీని అడుగుతుంది స్వప్న. ఎందుకు అలా అడుగుతున్నావంటాడు కాశీ. నువ్వు మా నాన్న కాళ్లు ఎందుకు పట్టుకున్నావని అడుగుతుంది. ఓ అదా.. నాకు ఆఫీసులో ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను. మామయ్య గారు మెచ్చుకున్నారు. దాంతో ఆశీర్వాదం తీసుకున్నాను అని చెప్పి కవర్ చేస్తాడు కాశీ. నేనే అనవసరంగా అనుమానించాను అని మనసులో అనుకుంటుంది స్వప్న. నేను నిజంగానే తప్పు చేస్తున్నాను అని మనసులో అనుకుంటాడు కాశీ.
56
నా కోపాన్ని ఎందుకు తీసుకోదు?
దశరథ, కార్తీక్ గుడి మెట్లపై కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వారి మాటలను చాటుగా వింటూ ఉంటుంది సుమిత్ర. మా పెళ్లైన దగ్గరినుంచి ప్రతి పెళ్లి రోజు ఈ గుడికి రావడం మాకు అలవాటు. నిజానికి ఈ అలవాటు ఈ రోజు మీ అత్తయ్యను ఇక్కడికి రప్పిస్తుందన్న ఆశతోనే నేను ఇక్కడికి వచ్చానురా అంటాడు దశరథ. కానీ బంధమే వద్దనుకొని వెళ్లిన మనిషికి ఇవన్నీ ఎందుకు అంటాడు. అత్త దీప మీద కోపంతో తాళి తీసింది తప్ప.. మీ మీద గౌరవం లేక కాదు మామయ్య అంటాడు కార్తీక్.
కానీ చేసింది తప్పే కదా.. అయినా నా బాధ.. తను తప్పు చేసిందని కాదు నన్ను అర్థం చేసుకోలేకపోయిందని మాత్రమే అంటాడు దశరథ. ఆ తప్పును నేను క్షమించాల్సింది. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నా ప్రేమను తీసుకున్న మనిషి.. నా కోపాన్ని ఎందుకు తీసుకోలేదు. నేను తనపై కాకుండా ఇంకా ఎవ్వరిపై కోపం చూపించాలి అంటాడు దశరథ. వెలుగుతున్న దీపాన్ని చూపించి.. అటు చూడు కార్తీక్ అవి జంటగా ఎంత బాగా వెలుగుతున్నాయో.. అవి అలా వెలిగితేనే అందం, అర్థం అని చెప్పబోతుండగా ఒక దీపం ఆరిపోతుంది.
66
సుమిత్రను చూసిన కార్తీక్
దీపం ఆరిపోవడంతో ఆందోళన పడ్తాడు దశరథ. నేను మా ఇద్దరి గురించి పోల్చి చెప్పినప్పుడే దీపం ఆరిపోయింది అంటే… నా ఇంటి దీపానికి ఏదో అయింది అని టెన్షన్ పడ్తాడు. సుమిత్ర బాగుండాలి. తనకి ఏదైనా అయితే నేను బతకలేను అంటాడు. అత్తకు ఏం కాదు.. క్షేమంగా ఉంటుందని ధైర్యం చెప్తాడు కార్తీక్. ఇంతలో ఆ దీపం మళ్లీ వెలుగుతుంది. చూశావా మామయ్య ఆ దీపం మళ్లీ వెలిగింది. అత్త కూడా క్షేమంగా ఉంటుంది. ఏమో ఇక్కడికి వస్తుందేమో.. నీ ముందు నిలబడుతుందేమో అని అనుకుంటూ సుమిత్రను చూస్తాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.