96 టైటిల్స్ అనుకుంటే అదొక్కటే, బల్లగుద్ది ఫిక్స్ చేసిన చిరంజీవి.. కట్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్

Published : Oct 29, 2025, 07:41 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక చిత్రానికి 96 టైటిల్స్ పరిశీలించారు. కానీ ఏదీ ఫైనల్ కాలేదు. చివరికి అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల టైటిల్ లాక్ అయింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంత పెద్ద విజయం సాధించిన ఆ మూవీ ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
చిరంజీవి, జయంత్ సి పరాన్జీ కాంబినేషన్ 

మాస్ మ్యానరిజమ్స్, కామెడీ పడించడంలో చిరంజీవికి తిరుగులేదు. కానీ చిరంజీవి తన కెరీర్ లో మాస్ అండ్ సీరియస్ అంశాలు ఉండే కథలే ఎక్కువగా చేశారు. సినిమా మొత్తం నవ్వించే అంశాలు ఉన్న చిత్రాలు తక్కువ. చిరంజీవి వరుస ఫ్లాపుల నుంచి బయటపడి హిట్లర్, మాస్టర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందుకున్నారు. ఆ రెండు సినిమాలు సీరియస్ గా సాగే కథలే. ఆ తర్వాత చిరంజీవి, జయంత్ సి పరాన్జీ కాంబినేషన్ లో ఒక చిత్రం సెట్ అయింది. 

25
మెగా బ్రదర్ నాగబాబు నిర్మాత 

 మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రానికి నిర్మాత. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆ చిత్రాన్ని నిర్మించారు. ఈసారి చిరంజీవి ఫుల్ ఫన్, ఫ్యామిలీ అంశాలు ఉండే సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ విధంగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో 'బావగారు బాగున్నారా' మూవీ ప్రారంభమైంది. అప్పటికి జయంత్ సి పరాన్జీ ప్రేమించుకుందాం రా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దీనితో చిరంజీవి, పరాన్జీ కాంబినేషన్ పై అంచనాలు పెరిగాయి. కథ లాక్ అయిపోయింది. కానీ టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. 

35
96 టైటిల్స్ అనుకున్నారు 

చిరంజీవి, నిర్మాత నాగబాబు, రచయితలు పరుచూరి బ్రదర్స్, దర్శకుడు పరాన్జీ అంతా టైటిల్ కోసం తెగ కసరత్తులు చేస్తున్నారు. ఏకంగా 96 టైటిల్స్ పరిశీలించారు. ఏదీ ఫైనల్ కాలేదు. కానీ ఈ చిత్రానికి పరాన్జీ వద్ద పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల టైటిల్ ఫైనల్ అయింది. ఈ మూవీకి బావగారు బాగున్నారా అనే టైటిల్ ఇచ్చింది ఆ అసిస్టెంట్ డైరెక్టరే కావడం విశేషం. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో కాదు.. వీఎన్ ఆదిత్య. ఆ తర్వాత కాలంలో ఆయన దర్శకుడిగా మారి నేనున్నాను, మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించారు. 

45
అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల టైటిల్ ఫిక్స్ 

ఎలాగైనా టైటిల్ ఫైనల్ చేయాలని చిరంజీవి, నాగబాబు, పరుచూరి బ్రదర్స్, డైరెక్టర్ పరాన్జీ అంతా ఒక రూమ్ లో కూర్చుని మీటింగ్ పెట్టారు. అప్పటికే ఈ చిత్రం కోసం పరిశీలించిన 96 టైటిల్స్ ని ఒక ఫైల్ లో నోట్ చేశారు. ఆ ఫైల్ ని తీసుకురమ్మని పరాన్జీ.. వీఎన్ ఆదిత్యని అడిగారు. ఈ విషయాలన్నీ వీఎన్ ఆదిత్య ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. నేను ఆ ఫైల్ తీసుకుని వెళుతూ.. చిరంజీవి గారి మాస్టర్ మూవీలో ఉండే హిట్ సాంగ్ బావగారు బాగున్నారా గుర్తుకు వచ్చింది. ఈ చిత్రానికి ఆ టైటిల్ పర్ఫెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో రంభకి చిరంజీవి బావగా నటిస్తారు. దీనితో ఆ ఫైల్ లో టాప్ లో బావగారు బాగున్నారా అనేది రాశాను. 

55
బల్ల గుద్ది టైటిల్ ఫిక్స్ చేసిన చిరంజీవి 

చిరంజీవి గారు చూసి ఇదేంటి ఇది అని అడిగారు. తన అక్క మొగుడు చిరంజీవి గారే అని రంభకి తెలియడంతో ఇంటర్వెల్ పడుతుంది. ఆ సీన్ ని కాస్త పెంచి.. చిరంజీవి కంగారు పడుతుంటే రంభ.. బావగారు బాగున్నారా అని అడగడం చిరంజీవి విచిత్రమైన హావభావాలు ఇవ్వడంతో ఇంటర్వెల్ వేద్దాం అని చెప్పాను. నేను చెప్పింది అందరికీ తెగ నచ్చేసింది. చిరంజీవి గారు బల్ల గుద్ది ఇదే మన టైటిల్ అని ఫిక్స్ చేసేశారు. వెంటనే మీడియాకి అనౌన్స్ చేసేశారు. చిరంజీవి గారి గొప్ప మనసు ఏంటంటే.. మా అసిస్టెంట్ డైరెక్టర్ వల్లే ఈ చిత్రానికి టైటిల్ దొరికింది అని ఆయన ఓపెన్ గా చెప్పడం అని వీఎన్ ఆదిత్య గుర్తు చేసుకున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories