సూర్య
నటుడు సూర్య 44వ సినిమాకి టైటిల్‌ని ప్రకటించింది యూనిట్. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి `రెట్రో` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో సూర్యకు జంటగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, శ్రేయాస్ ఛాయాగ్రహణం అందించారు. `రెట్రో` చిత్రాన్ని నటుడు సూర్య, జ్యోతిక కలిసి వారి 2డి కంపెనీ ద్వారా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
రెట్రో మూవీ సూర్య
`రెట్రో` సినిమా టీజర్ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈరోజు విడుదలైంది. అందులో రజినీ దళపతి సినిమా స్టైల్‌లో ఒక లవ్ ప్రపోజల్ సీన్ ఉంది. నటుడు రజనీకాంత్ అభిమాని అయిన కార్తీక్ సుబ్బరాజు, దళపతి సినిమా రెఫరెన్స్‌తోనే `రెట్రో` సినిమాలోని ప్రేమ సన్నివేశాన్ని చిత్రీకరించారని చెబుతున్నారు. ఈ చిత్రంలో ప్రేమికుడిగానే కాకుండా గ్యాంగ్‌స్టర్‌గా కూడా సూర్య అదరగొట్టాడు. ఈ చిత్రం టీజర్ చూసిన అభిమానులు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
రెట్రో విడుదల అప్డేట్
`నందా` సినిమాలో మొదటిసారి సిగరెట్ తాగడం నేర్చుకున్న సూర్య, ఆ తర్వాత తన సినిమాల్లో పెద్దగా ధూమపానం చేసే సన్నివేశాల్లో నటించలేదు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత `విక్రమ్` సినిమాలో రోలెక్స్ పాత్ర కోసం సిగరెట్ తాగే సన్నివేశంలో నటించిన సూర్య, ఇప్పుడు `రెట్రో` సినిమాలో మళ్ళీ సిగరెట్ తాగే సన్నివేశాల్లో నటించాడు. ఆయా సీన్లు అదిరిపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ విడుదల అప్డేట్ కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది.