లవర్‌ని కలిసిన నిఖిల్‌, మాట తప్పడంతో ముఖం చూపించలేక తంటాలు, శ్రీముఖి అగ్గిరాజేసిందా?

First Published | Dec 25, 2024, 8:18 PM IST

ప్రియురాలిని కలిసిన బిగ్‌ బాస్‌ తెలుగు 8 విన్నర్‌ నిఖిల్‌. కానీ శ్రీముఖి చేసిన పనికి ఇద్దరి మధ్య అగ్గిరాజేసినట్టు అయ్యింది. ఇదిప్పుడు వైరల్‌ అవుతుంది. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 విన్నర్‌గా నిలిచాడు టీవీ నటుడు నిఖిల్‌. ప్రారంభం నుంచి బ్యాలెన్స్ డ్‌గా గేమ్‌ ఆడుతూ మెప్పించాడు. మధ్యలో తగ్గినా చివర్లో పుంజుకున్నాడు. మొత్తానికి విన్నర్‌గా నిలిచాడు. అయితే నిఖిల్‌ విన్నర్‌ అని అంతా ముందే ఊహించారు. హౌజ్‌లో పరిణామాలు దాన్నే ప్రతిబింబించాయి. మరోవైపు పలువురు మాజీ కంటెస్టెంట్లు కూడా ఈ విషయాన్నే స్పష్టం చేశారు. దీంతో విన్నర్‌ ని ముందే నిర్ణయించారా అనే సందేహం కలిగింది. 

ఏదేమైనా నిఖిల్‌ విన్నర్‌ అయ్యారు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. నిఖిల్‌కి ఓ లవర్‌ ఉంది. టీవీ నటి కావ్యతోనే ఆయనకు లవ్‌ స్టోరీ నడిచింది. కానీ కొన్నాళ్ల క్రితమే ఈ ఇద్దరు విడిపోయారు. కొన్ని మనస్పర్థాలు వచ్చాయి. కావ్యని అపార్థం చేసుకున్నాడు నిఖిల్‌. దీంతో బిగ్‌ బాస్‌ షోకి రావడానికి ముందే విడిపోయారు. ఆ డిప్రెషన్‌ నుంచి బయటకు వచ్చేందుకే బిగ్‌ బాస్‌కి వచ్చాడట. షో అయిపోయాక కప్‌ గెలుచుకుని ఫస్ట్ ఆమె ఇంటికే వెళ్తానన్నాడు నిఖిల్‌. కానీ వెళ్లలేదని తెలుస్తుంది. 
 


ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇద్దరు కలిశారు. ఒకే షోలో పాల్గొన్నారు. శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న ఆదివారం `స్టార్‌ మా పరివార్‌` షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. ఇందులో ఈ ఇద్దరి మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో నిఖిల్ గెస్ట్ తరహాలో కనిపించారు. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు యష్మి, ప్రియాంక జైన్‌, మానస్‌ వంటి వారుపాల్గొన్నారు. వారితోపాటు కావ్య కూడా వచ్చారు. 
 

నిఖిల్‌కి టీవీ నటులు ఇటు వైపు ఉన్నారంటూ ఒక వైపు ఉన్నవారిని పరిచయం చేసింది. మధ్యలో కావ్య ఉంది. ఆమెని వదిలేసి పక్కన ఉన్న ప్రియాంక జైన్‌, మానస్‌లను పరిచయం చేసింది. ఆ సమయంలో కావ్య చాలా సీరియస్‌గా కనిపించింది. ఆయన్నే సీరియస్‌గా చూస్తూ ఉంది. అయితే బ్లాక్‌ కళ్లద్దాలు పెట్టుకొని దాన్ని మ్యానేజ్‌ చేశాడు నిఖిల్‌. శ్రీముఖి కూడా అడిగింది.ఈ షోలో మాత్రం కళ్లద్దాలు తీసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. కావ్య మాత్రం ప్రతిసారి సీరియస్‌గానే కనిపించింది. 
 

బిగ్‌ బాస్ 8 విన్నర్‌ అయ్యాక ట్రోఫీతో కావ్య ఇంటికి వెళ్తానని తెలిపారు నిఖిల్‌. కానీ వెళ్లలేదు. వీరి మధ్య గ్యాప్‌ అలానే కొనసాగుతుంది. పైగా ఈ షోలో, శ్రీముఖి చేసిన పని అగ్గిరాజేసినట్టు అయ్యిందని అంటున్నారు నెటిజన్లు. కావ్యని చూస్తుంటే పరిస్థితి అలానే అనిపిస్తుంది. మరి వీరి మధ్య దూరం పెరుగుతుందా? తగ్గుతుందా? కావ్యని నిఖిల్‌ ఎలా డీల్‌ చేస్తాడు? వీరిద్దరు కలుస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 

ఇదిలా ఉంటే ఈ షోలో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ యష్మి కూడా పాల్గొనడం విశేషం. ఆమెతోనూ నిఖిల్‌ హౌజ్‌లో పులిహోర కలిపారు. ఇద్దరు క్లోజ్‌గా మూవ్ అయ్యారు. గౌతమ్‌ క్లోజ్‌ కావాలనుకున్నా, ఆయన్ని పక్కన పెట్టి నిఖిల్‌కి దగ్గరైంది యష్మి, కానీ ఓ దశలో వీరిమధ్య కూడా గొడవలు వచ్చాయి.

యష్మిని దూరమే పెట్టాడు నిఖిల్‌. దీంతో తన క్యారెక్టర్‌ని బ్యాడ్‌ చేస్తున్నావని చెప్పి ఫైర్‌ అయ్యింది. ఆ తర్వాత ఆమె ఎలిమినేట్‌ అయ్యింది. ఈ విషయంలో దొరికిపోయినా చివరి వరకు నిలబడ్డాడు నిఖిల్‌. బిగ్ బాస్‌ తెలుగు 8 విన్నర్‌గా నిలిచారు. 

read more: కొడుకు చనిపోయాడంటూ త్రిష కన్నీటి పర్యంతం.. పండగపూట ఇంట్లో విషాదంతో బ్రేక్‌ ప్రకటన

also read: జైలు నుంచి బయటకు వచ్చాక అల్లు అర్జున్‌ని కలిశారా? జానీ మాస్టర్‌ రియాక్షన్‌ ఇదే
 

Latest Videos

click me!