రీసెంట్ గా ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో రిలీజ్ అయిన కంగువా చిత్రం భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దాని నుంచి కోలుకుని సూర్య మరిన్ని చిత్రాలు సైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీని పూర్తి చేశారు సూర్య. అలాగే ప్రస్తుతం ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కాగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అని తెలుస్తోంది.
Actor Suriya
అట్లూరి వెంకీ ఇప్పటివరకూ ధనుష్‌తో ‘సార్’, దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. ఈ నేపధ్యంలో సూర్య..వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయటానికి ఓకే చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కూడా సితార సంస్థలోనే వుంటుంది. ఈ మేరకు సూర్యతో డిస్కషన్లు నడుస్తున్నాయి. సూర్యకి చెప్పిన కథలో మంచిపాయింట్ ఉండటంతో వెంకీ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి, నేపధ్యం గురించిన విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.
అందుతున్న సమాచారం మేరకు సూర్య తో చేయబోయే ప్రాజెక్ట్ కూడా వైవిధ్యంగా వుండబోతోందని తెలుస్తోంది. మారుతి కారు ఇండియాకు ఎలా వచ్చింది? దాని నేపథ్యం ఏమిటి? అనే బ్యాక్ డ్రాప్ లో వెంకీ అట్లూరి కథ రాసుకుంటున్నట్లు తెలుస్తోంది. చాలా ఇంట్రస్టింగ్ గా జరిగే కొత్త తరహా కథ అంటున్నారు.
Suriya
అలాగే సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి 796 CC అనే టైటిల్ ని పెట్టారని తెలుస్తోంది. 796 CC ఇంజన్ తో మారుతి కార్లు ఇండియా మార్కెట్ లోకి ప్రవేశించి ఓ కొత్త చరిత్రను సృష్టించాయి. ఇండియన్ ఆటో మెబైల్ ఇండస్ట్రీలో మారుతి కార్లు ఎలా గేమ్ ఛేంజర్ గా మారాయన్నదే అసలు పాయింట్ అని తెలుస్తోంది.
photo credit-aha unstoppable 4
796 CC ఖచ్చితంగా ఆసక్తికరంగా వుండే పాయింట్ నే. అందుకే సూర్య కూడా ఒకె చెప్పి వుంటారని చెప్తున్నారు. సూర్య ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం చూస్తున్నారు. అదే టైమ్ లో తెలుగు లో సరైన డైరెక్ట్ సినిమా కోసం ఎప్పటి నుంచో చూస్తున్నారు. రక్త చరిత్ర 2 తర్వాత సూర్య తెలుగులో చేస్తున్న సినిమా ఇదే.
actor suriya
‘సార్’ వంటి ఘన విజయం తర్వాత వెంకీ అట్లూరి-సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లక్కీ భాస్కర్' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దర్శకుడు వెంకీ అట్లూరి తన కెరీర్ ని రొటీన్ సినిమాల వైపు కాకుండా ఓ డిఫరెంట్ దారి ఎంచుకుని ముందుకు వెళుతున్నారు. విద్యా వ్యాపారం బ్యాక్ డ్రాప్ లో ధనుష్‌తో ఒక సినిమా చేసారు. బ్యాంక్ లావాదేవీల లొసుగుల నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ చేసారు. అలాగే ఈసారి కూడా వెంకీ అట్లూరి వైవిధ్యమైన సబ్జెక్ట్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.