కుర్రాళ్ళని ఊపేయడం కోసం నితిన్.. కన్నీళ్లు పెట్టించడం కోసం చిరు

First Published | Dec 26, 2024, 7:35 AM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ చిత్రాల ట్రెండ్ క్రేజీగా మారిపోయింది. సందర్భం దొరికితే చాలు.. గతంలో సూపర్ హిట్ అయిన చిత్రాలని రీరిలీజ్ చేసేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.

టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ చిత్రాల ట్రెండ్ క్రేజీగా మారిపోయింది. సందర్భం దొరికితే చాలు.. గతంలో సూపర్ హిట్ అయిన చిత్రాలని రీరిలీజ్ చేసేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. జల్సా, ఆరెంజ్, మురారి, ఇంద్ర, ఓయ్ లాంటి చిత్రాలు రీ రిలీజ్ అయితే ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. 

త్వరలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా జనవరి 1 న కొన్ని తెలుగు చిత్రాలు రీరిలీజ్ అవుతున్నాయి. వీటిలో రాజమౌళి చిత్రం కూడా ఉంది. యంగ్ హీరో నితిన్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సై చిత్రం అప్పట్లో యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రగ్బీ క్రీడ నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 


కాలేజ్ యువతలో గ్రూపులు, వాళ్ళ గొడవలు, సరదాలు, ఎమోషన్స్ చూపిస్తూ రాజమౌళి సై చిత్రాన్ని తెరకెక్కించారు. నితిన్, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ప్రదీప్ రావత్ విలన్ గా నటించారు. రగ్బీ ఆట, విలన్ ని ఆటపట్టించే సన్నివేశాలు, వేణు మాధవ్ కామెడీ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. ఇలాంటి చిత్రం రి రిలీజ్ అవుతుంటే యువతకి పండగే. 

కొత్త సంవత్సరం సంబరాలని రెట్టింపు చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగుతున్నారు. చిరంజీవి వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కంబ్యాక్ అయ్యేలా చేసిన చిత్రం హిట్లర్. ఈ చిత్రానికి ముందు చిరు దారుణమైన డిజాస్టర్స్ ఎదుర్కొన్నారు. రెండేళ్లు గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఆ తర్వాత హిట్లర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టి తన సత్తా ఇంకా అయిపోలేదు అంటూ ఇండస్ట్రీకి సంకేతాన్ని ఇచ్చారు. 

చిరంజీవి కోరుకునే మాస్ అంశాలతో పాటు సెంటిమెంట్ పాళ్ళు కూడా ఈ చిత్రంలో ఎక్కువగా ఉంటాయి. ఈ చిత్రంలో చిరంజీవి ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా నటించారు. ఐదుగురు చెల్లెళ్లకు అన్నీ తానై పెంచి పెద్ద చేసే పాత్రలో చిరంజీవి నటన కంటతడి పెట్టించే విధంగా ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక జనవరి 1న రి రిలీజ్ అవుతున్న మరో చిత్రం సిద్దార్థ్ అంటించిన ఓయ్. ఇటీవలే ఈ చిత్రం రీరిలీజ్ అయింది ఇది ఈ చిత్రానికి సెకండ్ రీ రిలీజ్. 

Latest Videos

click me!