Suriya: హీరో సూర్య, డైరెక్టర్ జిత్తు మాధవన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్, టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూర్య ప్రస్తుతం హిట్‌మ్యాన్‌గా దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఆయన నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మొదటగా వచ్చిన 'కరుప్పు' సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఆగస్టులో విడుదలైన 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా రూ.250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
24
హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ప్లాన్..
ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సూర్య సిద్ధమయ్యాడు. తన 47వ సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు. మలయాళంలో 'రోమాంచం', 'ఆవేశం' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన జిత్తు మాధవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నటి జ్యోతిక తన సొంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ నటిస్తుండగా, మలయాళ నటుడు నస్లెన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.
34
సూర్య 47వ సినిమా టైటిల్
సూర్య 47వ చిత్రానికి 'సీన్' అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన మాస్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో సూర్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో సూర్యతో పాటు ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ రాజ్‌ప్రియన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించాడు. గతేడాది చివర్లో చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కేరళలో కూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇది భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ కావడంతో, సూర్య అభిమానులు, సౌత్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మలయాళంలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన సుషిన్ శ్యామ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయనకు ఇది తొలి తమిళ చిత్రం కావడం విశేషం. అలాగే, దర్శకుడు జిత్తు మాధవన్‌కు కూడా ఇదే మొదటి తమిళ సినిమా. ఈ చిత్రంలో జాన్ విజయ్, ఆనంద్ రాజ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో, ఈ ఏడాది దీపావళి రేసులో అడుగుపెట్టిన తొలి తమిళ సినిమాగా 'సీన్' నిలిచింది.