`కరుప్పు` చిత్రంలో సూర్య రెండు పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ పాత్రలో సూర్యగా కనిపించారు, తనకు మరో పేరు ఉందని అనడం విశేషం. శరవణన్ అనే మరో పాత్రలో సూర్య నటించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
ఒక పాత్ర మాస్‌గా, పెద్దగా, మరో పాత్రలో యంగ్‌గా కనిపిస్తున్నారు సూర్య. ఈ సినిమాలో ఆర్జే బాలాజీ విలన్ అని చెబుతున్నారు. ఈ మూవీ టీజర్ మంచి వ్యూస్‌తో దూసుకుపోతుంది.