Karuppu First Review: 'కంగువా' సినిమా తర్వాత సూర్య నటిస్తున్న 'కరుప్పు' సినిమా ఎలా ఉండబోతుందో ఫస్ట్ రివ్యూ వచ్చింది. నటుడు నట్టి సుబ్రమణ్యం తనదైన రివ్యూ ఇచ్చారు.
సూర్యకి సరైన హిట్ పడి చాలా రోజులవుతుంది. ఓటీటీలో వచ్చిన `జైభీమ్` చిత్రంతో అలరించారు. ఈ మూవీ విశేష ఆదరణ పొందింది. అంతేకాదు ఇందులో నటనకుగానూ ఉత్తమ జాతీయ నటుడిగా నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన ఏ సినిమా ఆడియెన్స్ ని అలరించలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన `కంగువాా` డిజప్పాయింట్ చేసింది. ఈ మధ్య వచ్చిన `రెట్రో` మూవీ కూడా ఆడలేదు. ఇలా వరుసగా మంచి అంచనాల మధ్య వచ్చిన సినిమాలు పరాజయం చెందడంతో అభిమానులు డిజప్పాయింటింగ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి ఆశలు, చివరికి సూర్య ఆశలు కూడా `కరుప్పు` మూవీపైనే ఉన్నాయని చెప్పొచ్చు.
25
నాల్గో సారి జోడీ కట్టిన సూర్య, త్రిష
`కరుప్పు` మూవీలో సూర్య సరసన త్రిష నటిస్తోంది. ఈ ఇద్దరు కలిసి నాల్గోసారి నటిస్తున్నారు. గతంలో 'మౌనం పేసియదే', 'ఆరు', 'ఆయుధ ఎళుత్తు' చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఆకట్టుకోవడంతో తాజా చిత్రంపై కూడా అంచనాలు నెలకొన్నాయి. `కరుప్పు` చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. ఆర్జే బాలాజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు, దర్శకుడు అయిన ఆర్జే బాలాజీ ఈ సినిమాని తనదైన స్టయిల్‌లో ఊరమాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఆ మధ్య విడుదలైన టీజర్‌ని బట్టి ఈ విషయం అర్థమవుతుంది. ఇందులో వింటేజ్ సూర్యని చూడొచ్చు.
35
`కరుప్పు` ఫస్ట్ రివ్యూ
`కరుప్పు` చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే ఆయన పాత్ర లో రెండు షేడ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. మంచి కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్లు, ఆథ్యాత్మిక అంశాలతోపాటు అదిరిపోయే యాక్షన్ సీన్లు ఉన్నాయి. అవన్నీ టీజర్‌లో విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇన్నాళ్లకి సూర్య పర్‌ఫెక్ట్ కమర్షియల్ మూవీ చేస్తున్నారని, హిట్ పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది ఫస్ట్ రివ్యూ వచ్చింది. నటుడు నట్టి సుబ్రమణ్యం తన మొదటి సమీక్షను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్జే బాలాజీ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని, తన బెస్ట్ ఇచ్చారని చెప్పారు.
ఈ సినిమాలో కోర్టులో కేసులను ఎలా డీల్ చేస్తారో చూపించారు.రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఆ ఎలిమెంట్లు బాగా ఆకట్టుకుంటాయి. మంచి దైవభక్తితో కూడిన కథాంశం ఉందని, అది ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు. యాక్షన్ సీన్లు, అందులో సూర్య యాక్షన్ వేరే లెవల్ అని తెలిపారు. ఇప్పుడు నట్టి చెప్పిన మాటలు సూర్య అభిమానుల్లో ఆనందాన్ని నింపాయి. అదే సమయంలో ఈ మూవీ థియేటర్లలో మోత మోగిస్తుందని భావిస్తున్నారు.
55
సంక్రాంతికి `కరుప్పు`?
నటుడు నట్టి సుబ్రమణ్యం కామెంట్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. అదే సమయంలో సినిమా ఎలా ఉండబోతుందనేది క్లారిటీ ఇచ్చింది. సినిమా కోసం ఫ్యాన్స్, సాధారణ ఆడియెన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలని భావించారు. కానీ రిలీజ్ వాయిదా పడుతుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకుప్లాన్ చేస్తున్నారు. ఈ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.