Trolls on OG: డిజాస్టర్‌ ఓజీ ట్రెండింగ్‌.. ఆ స్టార్‌ హీరో ఫ్యాన్స్ పనేనా, ఒకరు కాదు ఇద్దరు ఎటాక్‌

Published : Sep 25, 2025, 09:34 PM IST

Trolls on OG: `ఓజీ` సినిమా ఓ వైపు థియేటర్లలో రచ్చ చేస్తోంది. మరోవైపు సోషల్‌ మీడియాలో ఈ మూవీపై నెగటివ్‌ ప్రచారం జరుగుతుంది. డిజాస్టర్‌ ఓజీ ట్యాగ్ ని ట్రెండ్‌ చేస్తున్నారు. ఇందులో ఆ స్టార్‌ హీరో ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటం గమనార్హం. 

PREV
16
థియేటర్లలో `ఓజీ` విధ్వంసం

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `ఓజీ` సినిమా నేడు(గురువారం) విడుదలై ఆకట్టుకుంటోంది. పవన్‌  అభిమానులను బాగా అలరిస్తోంది. సినిమాలో తమ అభిమాన హీరోని చూసి వారంతా సంతోషంలో సంబరాలు చేసుకుంటున్నారు. చాలా కాలం తర్వాత పవన్‌ నుంచి ఇలాంటి సాలిడ్‌ మూవీ రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం, పటాసులతో సెలబ్రేట్‌ చేసుకోవడం పలు ప్రాంతాల్లో కనిపిస్తుంది. `అత్తారింటికి దారేదీ` తర్వాత పవన్‌ నుంచి ఇలాంటి సాలిడ్‌ హిట్‌ సినిమా పడలేదు. సక్సెస్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఓపికతో వెయిట్‌ చేస్తూ వచ్చారు. ఈ సారైనా వస్తుందేమో అని ప్రతి సినిమాకి ఆశించారు. ప్రతి సినిమాకి నిరాశనే ఎదురయ్యింది. కానీ `ఓజీ` వాటికి ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. ఫ్యాన్స్ ఊగిపోయేలా చేసింది. వెండితెరపై పవన్‌ కళ్యాణ్‌ స్టయిలీష్‌ వాక్‌, యాక్షన్‌ సీన్లు, దర్శకుడు సుజీత్‌ టేకింగ్‌, ఒక అభిమానిగా ఆయన తన అభిమాన హీరోని చూపించిన విధానం, దీనికితోడు మ్యూజిక్‌ డైరెక్టర్ తమన్‌ అందించిన సంగీతం, ముఖ్యంగా బీజీఎం సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లిపోయాయి. థియేటర్లకి పూనకాలు తెప్పించాయి.

26
డిజాస్టర్‌ ఓజీ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌

ఓ వైపు పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఓజీ సక్సెస్‌ సెలబ్రేషన్స్ లో బిజీ ఉంటే, మరోవైపు యాంటీ ఫ్యాన్స్ సినిమాపై నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారు. పని గట్టుకుని ట్రోల్‌ చేస్తున్నారు. సినిమా బాగా లేదని, డిజాస్టర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ట్విట్టర్‌లో ఏకంగా `డిజాస్టర్‌ ఓజీ` అని యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. సినిమా బాగలేదని, మూవీలో కథ లేదని, ఎలివేషన్లు తప్ప ఇంకా ఏం లేదంటున్నారు. ఆహా ఓహో అని హడావుడి చేశారు, చివరికి మీరు చేసింది ఇదేనా అని సెటైర్లు వేస్తున్నారు. అతిగా మోస్తే ఇలానే ఉంటుందంటున్నారు. సుజీత్‌ పార్ట్ పార్ట్ లుగా సినిమా బాగానే తీస్తాడని, కానీ ఎంగేజింగ్‌గా తీయలేడని నిరూపితమయ్యిందంటున్నారు. చేసిన పాపం ఊరికే పోదు అని, ఈ మూవీ కూడా పోయిందని, సినిమా అస్సలు బాగలేదని, డిజాస్టర్‌ అని, వరస్ట్ అంటూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. ఒకేసారి వేల మంది నెటిజన్లు ఈ ట్యాగ్‌తో పోస్టు లు పెట్టడంతో డిజాస్టర్‌ ఓజీ ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓ వైపు పవన్‌ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా, ఇలాంటి నెగటివ్‌ ప్రచారం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

36
ఇది ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ పనేనా ?

మరి ఇంతగా నెగటివ్‌ ప్రచారం చేస్తున్నది ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్వీట్ల ఐడీలను, ట్విట్టర్‌ ఐడీ ఫోటోలను గమనిస్తే మెయిన్‌గా ఇద్దరు స్టార్‌ హీరోల ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఒక ఊహించని హీరో ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటం గమనార్హం. పవన్‌ కళ్యాణ్‌కి, అల్లు అర్జున్‌కి గత కొంత కాలంగా పడటం లేదు. ఫ్యాన్స్ మధ్య వార్‌ జరుగుతుంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్సే ఇదంతా చేస్తున్నారని అంతా భావించవచ్చు. కానీ అనూహ్యంగా బన్నీ ఫ్యాన్స్ కంటే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఎక్కువగా `ఓజీ` మూవీని ట్రోల్‌ చేస్తుండటం గమనార్హం. ఈ దారుణమైన ఫోటోలు, కామెంట్లు చేస్తున్న వారిలో ఎన్టీఆర్‌ ఫోటోలతో ఐడీలు ఉన్న నెటిజన్లే కావడం గమనార్హం. వారంతా `డిజాస్టర్‌ ఓజీ` అనే హ్యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొందరు అభిమానులు వివరణ కూడా ఇచ్చారు. `దేవర` సినిమా సమయంలో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ నెగటివ్‌ ప్రచారం చేశారని ట్వీట్లు పోస్ట్ చేసి మరీ ఈ కామెంట్లు పెడుతున్నారు. `దేవర` సినిమా సమయంలో పవన్‌ అభిమానులు ఇలా నెగటివ్‌ ట్రోల్‌ చేసినందుకు ఇప్పుడు `ఓజీ` సినిమాని తాము ట్రోల్‌ చేస్తున్నామని చెప్పడం గమనార్హం.

46
అల్లు అర్జున్‌, మహేష్‌ ఫ్యాన్స్ ఇన్ వాల్వ్ మెంట్‌ ఉందా?

అంతేకాదు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తోపాటు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ కూడా ఈ నెగటివ్‌ ప్రచారంలో భాగమయ్యారని తెలుస్తోంది. కొన్ని ఐడీలలో అల్లు అర్జున్‌ ఫోటోలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌ పేర్లు వచ్చేలా ఆయా అకౌంట్లు ఉన్నాయి. దీంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ కూడా ఉన్నారా? అనే సందేహం కలుగుతుంది. అయితే ఇటీవల అల్లు వారి ఇంట్లో చోటు చేసుకున్న విషాదం నేపథ్యంలో పవన్‌, బన్నీ కలిసిపోయారు. తమ మధ్య విభేదాలు లేవనేలా కనిపించారు. అయితే ఆ ప్రభావం ఈ ట్రోలింగ్‌ విషయంలో కనిపిస్తుంది. ఓజీని ట్రోల్‌ చేస్తున్న వారిలో బన్నీ ఫ్యాన్స్ చాలా తక్కువగా ఉంటున్నారు. ఇది వారి మధ్య రిలేషన్‌ని ప్రతిబింబిస్తుంది. మరోవైపు ఈ నెగటివ్‌ ప్రచారం చేసే వారిలో కొందరు మహేష్‌ బాబు ఫ్యాన్స్ కూడా ఉన్నారని అంటున్నారు. కాకపోతే అది చాలా తక్కువగానే ఉంది. కానీ ఎక్కువగా ఎన్టీఆర్‌ అభిమానులే చేస్తున్నట్టు ట్వీట్లని బట్టి తెలుస్తోంది.

56
వైసీపీ ఫ్యాన్స్ కూడా పవన్‌ `ఓజీ`పై ఎటాక్‌

ఇదిలా ఉంటే `ఓజీ` నెగటివ్‌ ప్రచారం వెనుక రాజకీయ కోణం కూడా ఉందని తెలుస్తోంది. వైఎస్‌ జగన్‌ అభిమానులు, వైసీపీ అభిమానులు కూడా ఇందులో భాగమయ్యారని తెలుస్తోంది. చాలా ట్విట్టర్‌ అకౌంట్లకి జగన్‌ ఫోటోలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ కళ్యాణ్‌కి, జగన్‌కి పడదు. ఇద్దరూ ఒకరినొకరు బద్ద శత్రువులుగా చూసుకుంటారు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అధికార ప్రతిపక్షాలకు మధ్య గొడవలు ఉన్నాయి. ఆ గొడవతోనే `ఓజీ` సినిమాపై నెగటివ్‌ ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్, వైసీపీ కార్యకర్తలు మెయిన్ గా `ఓజీ` సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్నట్టు పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇది వారి పనే అంటూ ఫ్రూప్‌ చూపిస్తున్నారు. 

66
హీరోలంతా ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సిందిదే?

అయితే ఇండస్ట్రీలో పవన్ కి, ఎన్టీఆర్ కి మధ్య మంచి అనుబంధమే ఉంది. పవన్ ని తారక్ బాబాయ్ అని పిలుస్తారు. వాళ్లు వాళ్లు బాగానే ఉంటారు. మధ్యలో అభిమానులు కొట్టుకోవడం విచారకరం. అయితే ఎవరు ట్రోల్ చేసినా, ఎవరు కొట్టుకున్నా సినిమా బాగుంటే, మూవీలో కంటెంట్ ఉంటే, అది ఆడియెన్స్ కి ఎక్కితే ఎవరూ దాన్ని ఆపలేరు. మరి ఓజీ విషయంలోనూ అదే జరుగుతుందా అనేది చూడాలి. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన `ఓజీ` చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటించింది. ఇమ్రాన్ హష్మీ నెగటివ్ రోల్ చేశారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, శుభలేఖసుధాకర్, రాహుల్ రవీంద్రన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. ఫస్ట్ డే ఈ మూవీ చాలా సినిమాల రికార్డులు బ్రేక్ చేయబోతుందని తెలుస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories