శోభన్‌బాబు చేయాల్సిన సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. ఆ స్టార్‌ హీరోయినే కొంప ముంచిందా?

First Published | Nov 13, 2024, 8:04 AM IST

శోభన్‌బాబు చేయాల్సిన ఓ సినిమాని సూపర్‌ స్టార్‌ కృష్ణ చేశారు. ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నారు. దీనికి ఓ హీరోయిన్‌ కారణం కావడం గమనార్హం. 
 

శోభన్‌ బాబు.. తెలుగు చిత్రపరిశ్రమలో సోగ్గాడిగా పేరుతెచ్చుకున్న హీరో. తిరుగులేని స్టార్‌గా ఎదిగిన నటుడు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తర్వాత ఆ స్థాయి ఇమేజ్‌, క్రేజ్‌ని తెచ్చుకున్న హీరో. సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజులకు దీటుగా ఎదిగిన నటుడు. తెలుగు జనం చేత సోగ్గాడిగా పిలిపించుకున్న స్టార్‌.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

అప్పట్లో మల్టీస్టారర్‌ చిత్రాలకు విరివిగా వచ్చాయి. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అలాగే శోభన్‌బాబు, కృష్ణ కలిసి కూడా చాలా సినిమాలు చేశారు. అయితే శోభన్‌బాబు హీరోగా చేయాల్సిన ఓ సినిమాని సూపర్‌ స్టార్‌ కృష్ణ చేశాడు. ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు. ఇండియన్‌ తొలి జేమ్స్ బాండ్‌గా పిలిపించుకున్నాడు.

మరి ఆ సినిమా ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదే `గూఢచారి 116`. తెలుగులో వచ్చిన ఫస్ట్ జేమ్స్ బాండ్‌ స్టయిల్‌ మూవీ. అయితే ఇందులో మొదట హీరోగా చేయాల్సింది శోభన్‌బాబు. అంతేకాదు ఈ సినిమాతోనే ఆయన పూర్తి స్థాయి సోలో హీరోగా పేరు వేసుకోవాల్సింది. కానీ సెట్‌ కాలేదు. 
 


ఈ సినిమాకి హీరోగా శోభన్‌బాబు అనుకున్నారు. ఆయన లుక్‌, బాడీ ఫిట్‌నెస్‌ ఇవన్నీ చూసి ఆయన్ని ఓకే చేశారు దర్శకుడు మళ్లీఖార్జున రావు, నిర్మాత దూండి.  కృష్ణ ముందు అసలు వాళ్ల మైండ్‌లోనే లేరు. హీరోయిన్‌ కోసం చూస్తున్నప్పుడు జయలలిత పేరు తెరపైకి వచ్చింది. ఆమెని సంప్రదించగా వాళ్లు ఓకే చెప్పారు.

హీరో ఎవరని చెప్పగా, శోభన్‌బాబుని చూపించారు. ఆయన్ని చూసి హీరోగా అతనైతే జయలలిత సినిమా చేయదని ఆమె తల్లి సంధ్యా చెప్పిందట. శోభన్‌ బాబు కలర్‌ తక్కువ ఉన్నాడని నో చెప్పిందట. దీంతో శోభన్‌బాబు చాలా ఫీలయ్యాడు. అయినా తప్పలేదు.

ఎందుకంటే అప్పటికీ ఆయనకు పెద్దగా గుర్తింపు లేదు. డబ్బుల కోసం వేషాలు వేసే స్థాయిలోనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే వేషాల కోసం నిర్మాతలు, దర్శకులను అడిగే పరిస్థితుల్లో ఉన్నాడు. దీంతో దర్శక నిర్మాతల నిర్ణయం మేరకు హీరోగా తప్పుకున్నాడు సోగ్గాడు. 
 

జయలలిత ఎర్రగా బుర్రగా, అందంగా ఉంటుంది. ఆమెకి సెట్‌ అయ్యేది కృష్ణ ఒక్కడే అని భావించారు. ఆయన్ని అప్రోచ్ కాగా, ఓకే చెప్పారు. అలా `గూఢచారి 116`లోకి సూపర్‌ స్టార్‌ కృష్ణ వచ్చారు. అయితే ఇందులో మరో కీలక పాత్ర ఉంది. కానీ పదినిమిషాలే ఉంటుంది. ఆ ఏజెంట్‌ 303 పాత్రలో శోభన్‌బాబుని నటింప చేశారు. కాసేపు కనిపించినా, తనదైన స్టయిల్‌లో ఇరగధీశాడు సోగ్గాడు. కృష్ణకి సమానంగా పేరుని తెచ్చుకున్నాడు.

అయితే హీరోగానే తాను చేసి ఉంటే ఆయన రేంజ్‌ వేరే లెవల్‌లో ఉండేదని చెప్పొచ్చు. ఈ సినిమా చేసి కృష్ణ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోయాడు. తొలి జేమ్స్ బాండ్‌ మూవీ చేసిన హీరోగా చరిత్రలో నిలిచిపోయాడు కృష్ణ. ఈ సినిమా 1966 ఆగస్ట్ 11న విడుదలై సంచలన విజయం సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.  

ఇలా ఓ హీరోయిన్‌ కారణంగా ఓ గొప్ప అవకాశాన్ని మిస్‌ చేసుకున్నాడు శోభన్‌బాబు. జయలలితనే సోగ్గాడి కొంప ముంచిందని చెప్పొచ్చు. అదే ఆయన చేసి ఉంటే సోగ్గాడి కథ వేరే ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆ తర్వాత జయలలిత తన వల్ల జరిగిన తప్పు తెలుసుకుని ఆయనతో కలిసి నటించింది. ఆ తర్వాత ఇద్దరు క్లోజ్‌ అయ్యారు. ప్రేమలో కూడా పడ్డారు. కానీ అప్పటికే శోభన్‌బాబుకి పెళ్లైంది. పిల్లలున్నారు. దీంతో సహజీవనం వరకే పరిమితమయ్యారని అంటుంటారు. 

read more:మోహన్‌ బాబు రిజెక్ట్ చేసిన సినిమాతో హిట్‌ కొట్టిన చిరంజీవి, పాపం కలెక్షన్‌ కింగ్‌ తలపట్టుకున్న వేళ

also read:సన్యాసిగా మారిపోతుందేమో అని అనుష్క పేరెంట్స్ లో టెన్షన్‌, యోగా టీచర్‌ స్వీటికి ముందే చెప్పాడా?

Latest Videos

click me!