సూర్య - జ్యోతిక సెలబ్రేషన్ ఫొటోలు బయటకు రాగానే, ఈ కోటలో పెళ్లి లేదా ఈవెంట్స్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. కోట యాజమాన్యం ఇచ్చిన సమాచారం ప్రకారం, గెస్టుల సంఖ్యను బట్టి వేర్వేరు వెడ్డింగ్ ప్యాకేజీలు ఉన్నాయి.
60 మంది గెస్టుల ప్యాకేజీకి సుమారు 21,350 పౌండ్లు (మన కరెన్సీలో సుమారు రూ.27.4 లక్షలు) ఖర్చవుతుంది. అలాగే 80 మందికి అయితే 24,350 పౌండ్లు (సుమారు రూ.31.2 లక్షలు) తీసుకుంటారు. ఈ ప్యాకేజీల్లో కోటను వాడుకోవడానికి అద్దె, భోజనం లాంటి ఏర్పాట్లు ఉంటాయి.
తక్కువ మందితో ఈవెంట్ చేసుకోవాలనుకునే వాళ్ల కోసం కూడా స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయి. 30 మందికి 20,560 పౌండ్లు (సుమారు రూ.26.4 లక్షలు), 50 మందికి 23,560 పౌండ్లు (సుమారు రూ.30.2 లక్షలు) ఛార్జ్ చేస్తారు.