సూర్య తలకు బలమైన గాయం.. ఆందోళనలో అభిమానులు.. అసలైమయ్యింది..?

First Published | Aug 9, 2024, 9:31 PM IST

సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్యకు షూటింగ్ లో ప్రమాదం జరిగిందా..? సూర్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? ఆందోళనలో ఉన్న అభిమానులకు మూవీ టీమ్ ఏం చెప్పారు..? 
 

suriya 44 shoot

డిఫరెంట్ క్యారెక్టర్స్ ను సెలక్ట్ చేసుకుంటూ.. దూసుకుపోతున్నాడు సూర్య. కోలీవుడ్‌ తో పాటు.. టాలీవుడ్ లో కూడా ఆయన సినిమాకు మంచి మార్కెట్ ఉంది.  వైవిధ్యమైన కథాంశాలతో కూడిన  కథలను సెలక్ట్ చేసుకుంటూ.. హిట్ సినిమాలు చేస్తున్నాడు సూర్య. ఈక్రమంలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం తో ఆయన ఓ మూవీ చేస్తున్నాడు. 

suriya 44

ఇక రీసెంట్ గా  కంగువా సినిమా షూటింగ్ కంప్లీట్  చేసుకుని.. సూర్య తన 44 వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అండమాన్‌లో ఫస్ట్‌  షెడ్యూల్ షూటింగ్‌ పూర్తి చేసుకున్న టీమ్‌.. ప్రస్తుతం సెకండ్ షెడ్యుల్ షూటింగ్ ను  ఊటీలో జరుపుకుంటోంది. జిగర్తాండ డబుల్ ఎక్స్' సక్సెస్ తర్వాత  దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ప్రస్తుతం ' సూర్యతో  44వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.  2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య-జ్యోతిక సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. 


Suriya

అయితే  ఊటీ షూటింగ్ లో సూర్య తలకు గాయం అయినట్టు తెలుస్తోంది.  యాక్షన్ సీక్వెన్స్ కు సబంధించిన షూటింగ్ జరుగుతుండగా..  సూర్య తనకు బలమైన గాయం అయ్యిందట. ఈక్రమంలో ఆయన  తల లోపలివరకూ  బలమైన గాయం కావడంతో... రక్తస్రావం ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. 

Director Karthik Subbaraj Suriya film Suriya 44 update out

దాంతో మూవీ టీమ్..  వెంటనే షూట్‌ను నిలిపివేసి ప్రథమ చికిత్స అందించి సూర్యను ఆస్పత్రికి తరలించారు. సూర్యను పరీక్షించిన డాక్టర్లు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత సినిమా పనులు ప్రారంభించవచ్చని చెప్పినట్లు సమాచారం.

Actor Suriyas Kanguva film trailer update loading

సూర్యకు షూటింగ్ లో గాయం అయ్యిందని తెలిసి.. ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో నిర్మాత వారికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిర్మాత రాజశేఖరన్ పాండియన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సూర్యకు స్వల్పంగా గాయమైందని తెలిపారు. కానీ ఇప్పటికే సూర్య కోలుకున్నారని.. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందొద్దంటూ విజ్ఞప్తి చేశారు.
 

Latest Videos

click me!