ఫుల్ జ్వరంలో కూడా మహేష్ బాబు ఫైట్ సీన్ షూటింగ్ చేసిన సినిమా ఏదో తెలుసా..?

First Published | Aug 9, 2024, 8:37 PM IST

సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఓ సందర్భంలో ఫుల్ జ్వరంతో ఉండి కూడా మహేష్ ఫైట్ సీక్వెన్స్ చేశారట. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా..? 
 

సూపర్ స్టార్ కృష్ణ వారసత్వం తీసుకుని ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినా.. మహేష్ బాబు తన సొంత ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు.  ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే మహేష్ బాబు.. ఆ సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడడు. ఇక తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. మహేష్ బాబు రీ రిలీజ్ సినిమాలతో హడావిడి చేస్తున్నారు. కాగా ప్రస్తుతం మహేష్ కు సబంధించిన ఓన్యూస్ వైరల్ అవుతోంది. 
 

Murari

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు  సందర్భంగా.. ఆయన సూపర్ హిట్ సినిమా మురారి రీరిలీజ్ అయ్యింది. థియేటర్లలో ఈసినిమా షో పడటంతో.. ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ఆ ఫోటోలు నెట్టింట శేర్ చేస్తూ.. హడావిడి చేస్తున్నారు. అయితే ఈసందర్భంగా మహేష్ బాబు చేసిన ఓ సాహసం గుర్తు చేసుకుంటున్నారు. సినిమా కోసం మహేష్ బాబు ఎంత డెడికేటెడ్ గా పనిచేస్తారు అనే విషయం ఈ సందర్భంగా తలుకుంటున్నారు. ఇంతకీ మహేష్ బాబు ఏం చేశాడంటే.. హెల్త్ ను కూడా లెక్క చేయకుండా తన సినిమా కోసం పనిచేశాడు. 


సినిమా కోసం మహేష్ బాబు చేసిన సాహసాన్ని దర్శఖుడు కృష్ణ వంశీ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అది కూడా ఏ సినిమానో కాదు మురారి సినిమాలోనే ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం మహేష్ చాలా కష్టపడరట.. ఆరోగ్యం బాలేకున్నా సినిమా కోసం షూటింగ్ చేశారట. ఈ విషయాన్నీ దర్శకుడు కృష్ణవంశీ పలు సందర్భాల్లో చెప్పారు.  ఓ ఇంటర్వ్యూలో కృష్ణ వంశీ మాట్లాడుతూ... మురారి సినిమా షూటింగ్ టైమ్ లో జరిగిన కొన్ని  జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. 

Murari

మురారి సినిమాలో ఫస్ట్ ఫైట్ అద్భఉతంగా ఉంటుంది. మహేష్ ఇష్టపడే ఏనుగును రవిబాబు దొంగిలించడం.. దాని కోసం మహేష్ గోదావరిలోదిగి పైట్ చేస్తాడు.. ఆ సీన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ షూటింగ్ జరిగే టైమ్ లో మహేష్ కు  తీవ్రమైన  జ్వరం ఉందట. కాని అది లెక్క చేయకుండా..మహేష్ బాబు షూటింగ్ కు వచ్చి.. అంత చలిలో.. ఆ నీళ్ళల్లో  జ్వరంతో ఫైట్ సీక్వెన్స్  కంప్లీట్ చేశారట. . అయితే ఈ ఫైట్ కు ముందు ఓ సాంగ్ కూడా ఉంటుంది. ఈ సాంగ్ కూడా నీళ్లలోనే ఉంటుంది. ఈ సాంగ్ ను కూడా  జ్వరంతో ఉండే పూర్తి చేశారట మహేష్ బాబు. 

నిర్మాతలకు నష్టం రాకూడదని.. తన కాల్షీట్ వాళ్లు నష్టపోకూడదని మహేష్ అలా చేశారట.  ఇక మురారి విషయానికి వస్తే.. కృష్ణ వంశీ  డైరెక్ట్ చేసిన ఈసినిమా... ఫ్యామిలీ ఆడియన్స్ మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈసినిమాలో పెళ్ళిపాట ఇప్పటికీ అలా ఉండిపోయింది అంతే.  ఈ సినిమాలో మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది.  ఇక ఈమూవీ ప్రస్తుతం రీరిలీజ్ అయ్యి సందడి చేస్తుండగా... ఓ జంట ఈ సినిమా థియేటర్ లో పెళ్ళి కూడా చేసుకున్నారు. అక్షంతలు.. పూల దండలతో.. మహేష్ పెళ్ళి సీన్ వచ్చినప్పుడు హడావిడి చేస్తున్నారు ఫ్యాన్స్. 
 

Latest Videos

click me!