ఎర్ర చందనం, విలేజ్ బ్యాక్ డ్రాప్ కాదు..అంతకి మించి..గ్లోబల్ లెవల్లో రాంచరణ్, సుకుమార్ మూవీ ?

First Published | Aug 9, 2024, 6:57 PM IST

రాంచరణ్ చిత్రానికి సుకుమార్ భారీ ప్లాన్ వేస్తున్నారట. ఏకంగా గ్లోబల్ లెవల్లో సినిమా ఉండేలా కథ సిద్ధం చేస్తున్నారట. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో తన భాగం షూటింగ్ పూర్తి చేశారు. నెక్స్ట్ బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. తన మేకోవర్ మార్చుకున్న తర్వాత చరణ్.. బుచ్చిబాబు మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు. 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీ తర్వాత చరణ్ సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు కమిటయ్యారు. రాంచరణ్ తో సుకుమార్ ఆల్రెడీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రంగస్థలం చిత్రం తెరకెక్కించారు. 


చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో రంగస్థలం ఒకటి. ప్రస్తుతం బన్నీతో సుకుమార్ పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే రాంచరణ్ చిత్రానికి సుకుమార్ భారీ ప్లాన్ వేస్తున్నారట. ఏకంగా గ్లోబల్ లెవల్లో సినిమా ఉండేలా కథ సిద్ధం చేస్తున్నారట. 

ఆల్రెడీ స్క్రిప్ట్ పై సీనియర్ రైటర్స్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గ్లోబల్ ప్రాజెక్టు గా ఉండాలని గ్లోబల్ ఇష్యూ నేపథ్యంలో కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా గ్లోబల్ ఇష్యూపై ఈ చిత్రం ఉండబోతోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వస్తుంది. 

Latest Videos

click me!