బాలీవుడ్‌ సినిమాపై సూర్య గుడ్‌ న్యూస్‌.. అది మరీ స్లో అంటూ సెటైర్లు

Published : Nov 03, 2024, 11:18 PM IST

హీరో సూర్య త్వరలో `కంగువా`తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే ఇటీవల తెలుగు సినిమా గురించి రియాక్ట్ అయిన ఆయన బాలీవుడ్‌లో సినిమా చేయడంపై గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

PREV
14
బాలీవుడ్‌ సినిమాపై సూర్య గుడ్‌ న్యూస్‌.. అది మరీ స్లో అంటూ సెటైర్లు
నటుడు సూర్య

తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు సూర్య. తొలినాళ్లలో విమర్శలు ఎదుర్కొన్న సూర్య, క్రమంగా తన నటనను మెరుగుపరుచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబడేందుకు  వస్తున్నారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 

24
దిశా పటాని

సూర్య త్వరలో `కంగువా` సినిమాతో రాబోతున్నారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా 38 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ `వేట్టయాన్‌` సినిమాతో పాటు అక్టోబర్ 10న ఈ సినిమా విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత వాయిదా పడింది. పోటీ ఎందుకని చెప్పి వాయిదా వేసుకున్నారు. 

34
కంగువ

ఈ సినిమాతో సూర్య తొలిసారిగా దర్శకుడు శిరుతై శివతో కలిసి పనిచేస్తున్నారు.  ఇందులో తమ్ముడు కార్తీ కూడా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా  నిర్మిస్తుండగా ఇందులో బాలీవుడ్ నటి దిశా పటాని కథానాయికగా నటిస్తోంది. అలాగే బాబీ డియోల్‌ నెగటివ్‌ రోల్‌లో మెరవబోతున్నారు. 

44
సూర్య కర్ణ

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు స్పందించారు. "ఒక ఏడాది క్రితమే ఒక బాలీవుడ్ సినిమాకు సైన్ చేశాను. కానీ ఆ సినిమా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. త్వరలోనే ఆ సినిమా వివరాలు వెల్లడిస్తారు" అని సూర్య తెలిపారు. ఆ సినిమానే 'కర్ణ' అని, ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం.

 read more: దుల్కర్‌ సల్మాన్‌ మామూలోడు కాదు, నాగ్‌ అశ్విన్‌ కే నో చెప్పాడా?.. చివరికి తెలుగులో లైఫ్‌ ఇచ్చింది ఆయనే!

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories