హౌస్ లో ప్రేరణ, విష్ణుప్రియ డమ్మీ ప్లేయర్లు.. వెళుతూ వెళుతూ నిజాలు నిగ్గు తేల్చిన నయని పావని 

First Published | Nov 3, 2024, 11:07 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 63వ రోజు ఆదివారం ఎపిసోడ్ ఊహించిన విధంగానే సాగింది. అంతా అనుకున్నట్లే నయని పావని ఎలిమినేట్ అయింది. సండే ఎపిసోడ్ కాబట్టి నాగార్జున ఫన్ గేమ్స్ తో షోని ప్రారంభించారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 63వ రోజు ఆదివారం ఎపిసోడ్ ఊహించిన విధంగానే సాగింది. అంతా అనుకున్నట్లే నయని పావని ఎలిమినేట్ అయింది. సండే ఎపిసోడ్ కాబట్టి నాగార్జున ఫన్ గేమ్స్ తో షోని ప్రారంభించారు. ఇంటి సభ్యుల చేత పాటలు పాడించడం, డ్యాన్సులు వేయించడం లాంటివి చేశారు. స్లిప్పుల్లో తెలుగు పాటలని ఇంగ్లీషులో రాసి ఉంటుంది. 

ఆ పాట ఏంటో గుర్తించి ఇంటి సభ్యులు పాడాలి. ప్రతి పాటని ఇంటి సభ్యులు గుర్తించి.. అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో గౌతమ్.. హరితేజని ఒకసారి.. రోహిణిని ఒకసారి ఎత్తుకుని డ్యాన్స్ చేయడం హైలైట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా చివరికి నామినేషన్స్ లో హరితేజ, నయని పావని నిలిచారు. నాగార్జున ఇద్దరికీ రెండు హ్యామర్స్ ఇచ్చారు. వారికి కేటాయించిన పలకాలని సుత్తితో కొట్టాలి. అప్పుడు ఆ పలకలపై హరితేజ, నయని ఫోటోలు కనిపిస్తాయి. 

Also Read : తండ్రి ఎంజీఆర్ అంతటి స్టార్, అయినా కటిక దరిద్రంలో బతికిన నటి.. చివరికి తెలుగు హీరోని పెళ్లి చేసుకుని..


హరితేజ ఫోటోపై సేఫ్ అని.. నయని ఫోటోపై ఎవిక్టెడ్ అని రాసి ఉంటుంది. దీనితో నయని ఎలిమినేట్ అయినట్లు నాగార్జున అనౌన్స్ చేశారు. ఇంటి సభ్యలు నయనికి ఎమోషనల్ సెండాఫ్ ఇచ్చారు. నయని నాగార్జున వద్దకి వేదికపైకి వెళ్ళింది. నాగార్జున ఇంటి సభ్యులతో కూడిన బొమ్మలని టేబుల్ పై ఉంచారు. హౌస్ లో ఉన్న డమ్మీ ప్లేయర్లు ఎవరో చెప్పి వాళ్ళ బొమ్మలని కింద పడేయాలి అని చెప్పారు. 

దీనితో మొహమాటం లేకుండా నయని హౌస్ లో డమ్మీ ప్లేయర్లు ఎవరో తేల్చేసింది. రోహిణి, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్ డమ్మీ ప్లేయర్లు అంటూ కామెంట్స్ చేసింది. రోహిణి ఇతరులపై డిపెండ్ అవుతోంది. ప్రేరణ కోపంలో నోరు జారుతోంది. విష్ణుప్రియ గేమ్ సరిగ్గా ఆడట్లేదు. గౌతమ్ అనవసర విషయాల్లో తలదూర్చుతున్నాడు అంటూ వివిధ కారణాలు చెప్పింది. 

అదే విధంగా హౌస్ లో బెస్ట్ ప్లేయర్స్ ఎవరు అని నాగార్జున ప్రశ్నించారు. తన దృష్టిలో హరితేజ, నిఖిల్, పృథ్వీ బెస్ట్ ప్లేయర్లు అని నయని పేర్కొంది. ముఖ్యంగా పృథ్వీలో నిజాయతి అంటే ఇష్టం అని నయని పేర్కొంది. మొత్తంగా హౌస్ నుంచి మరో వైల్డ్ కార్డు సభ్యురాలు ఎలిమినేట్ అయింది. 

Latest Videos

click me!