చెన్నై నుండి ముంబైకి వెళ్ళిపోయినప్పటి నుండి జ్యోతిక తన పేరెంట్స్ తో హ్యాపీగా ఉందని, జ్యోతికకి గౌరవం, జిమ్ టైమ్ బాగా అవసరమని, తల్లిదండ్రుల నుంచి ఆమె సమయాన్ని, ఒకప్పుడు ఇష్టపడిన లైఫ్‍స్టైల్‍ను ఎందుకు దూరం చెయ్యాలని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సూర్య తెలిపారు. అయితే చెన్నై నుండి ముంబైకి షిఫ్ట్ అయిన సమయంలో విడాకులు తీసుకుంటున్నారని కొందరు.. లేదు సూర్యను తన కుటుంబం నుంచి జ్యోతికనే దూరం చేసిందని మరికొందరు.. ఇలా సోషల్ మీడియాలో రకరకాలుగా రూమర్స్ వస్తున్న క్రమంలో సూర్య ఇచ్చిన క్లారిటీ అందరిని ఆశ్చర్యపరిచింది. సూర్య క్లారిటీతో ఆ రూమర్స్ కి చెక్ పడినట్లే.