
నిజ జీవిత కథలను తెరకెక్కించటం చాలా కష్టం. అందులో డ్రామా తక్కువ ఉంటుంది. చెప్పటానికి చాలా ఉంటుంది. ఏది వదిలేయాలి, ఎక్కడ ఎమోషన్ వస్తుందో చూసుకుని ముందుకు వెళ్లాలనేది స్క్రిప్టు నుంచి పెద్ద టాస్క్, ఏ మాత్రం తేడా వచ్చినా, కల్పన ఎక్కువైనా విమర్శలు వస్తాయి.
2014లో కాశ్మీర్ లో ఓ స్పెషల్ ఆపరేషన్ లో వీరమరణం పొంది, భారతదేశపు అత్యున్నత పురస్కారమైన అశోక చక్రతో గౌరవించబడ్డ గొప్ప సైనికుడు తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తమిళంలో తెరకెక్కిన చిత్రం “అమరన్” (Amaran).ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ ఈ రోజు రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉంది. తెలుగు వాళ్లకు నచ్చే కంటెంట్ ఉందా, చూడగలమా వంటి విషయాలు చూద్దాం.
అమరన్ కథేంటి
ఇది హీరోయిన్ పాయింటాఫ్ వ్యూలో అంటే రెబెక్కా వర్గీస్ (సాయి పల్లవి) పాయింటాఫ్ వ్యూలో నడిచే కథ. ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) జన్మించిన ఏడు నెలలకి పుట్టిన ఆమె.. అతడితో ఏడడుగులు వేసి, అతడి అమరుడు అయ్యాక కూడా ఏడు జన్మలకు నువ్వే నా ప్రాణం అని నడిచిన ఓ మహిళ కథనం. చెన్నైకు చెందిన ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) కాలేజీలో ఇందు రెబెక్కా వర్గీస్ (సాయి పల్లవి) తో పరిచయం ,ఆ తర్వాత ప్రేమతో మొదలవుతుంది. ముకుంద్ ఆర్మీలో చేరాడంతో ఇందు తండ్రికి ఇష్టం ఉండదు. మరో ప్రక్క మతాలు వేరు అవటం కూడా వారి పెళ్లికి అడ్డంగా మారుంది.
ఇటు ముకుంద్ తల్లి కూడా ఆ పెళ్లికి ఒప్పుకోదు. కానీ మెల్లిగా కుటుంబాన్ని ఒప్పిస్తాడు. ఆ తర్వాత ఆర్మీలో చేరి ఎదుగుతాడు. ఉద్యోగ నిర్వహణలో భాగంగా కశ్మీర్ లోయలోని తీవ్రవాదులపై విరుచుకుపడతాడు. ఆ క్రమంలోనే అతను ప్రాణాలు పోగొట్టుకుంటాడు? అయితే ఈ జర్నీలో ఇందు పాత్ర ఏమిటి? ఆమెకు ముకుంద్ ఏం ప్రామిస్ చేసాడు? వాళ్లిద్దరి బంధం ఎలా ఇప్పటికీ సజీవంగా ఉంది? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.
అమరన్ ఎలా ఉంది
కథగా చూస్తే చాలా ప్లాట్ గా ఉంటుంది. కానీ తెరపై దాన్ని ఇంట్రస్టింగ్ గా నేరేట్ చేసాడు దర్శకుడు. తెలుగులో ఇదే తరహా కథ,కథనంతో అడవి శేషు ప్రధాన పాత్రలో “మేజర్” సినిమా విడుదలై మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ “అమరన్” కూడా అలాగే మొదలవుతుంది. కానీ డిఫరెంట్ పాయింటాఫ్ వ్యూతో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. వాస్తవాలను, దేశభక్తిని తగు మోతాదులో ఉంది,సినిమాటెక్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి సినిమా చేసారు.
అలాగే చేస్తారని ప్రేక్షకులు ఊహించి వస్తారు కాబట్టి అక్కడ దాకా ఏ సమస్యా రాదు. అయితే దేశభక్తి అనేది సినిమాల్లో పెద్దగా వర్కవుట్ కాని టైమ్ ఇది. దాంతో ఈ స్క్రిప్టు ని 365 కోణంలో చూసుకుని, సాయి పల్లవి నటనను బేస్ చేసుకుని ముందుకు వెళ్లారు. అలాగే క్లైమాక్స్ అంటే చివరకి ఏం జరుగుతుందో చూసేవారికి పూర్తిగా తెలిసే ఉంటుంది. అలాగని స్వెచ్చ తీసుకుని కొత్త ట్విస్ట్ లు, టర్న్ లు కలపలేరు. కలపకూడదు అని ఫిక్సై చేసారు.
“షేర్ షా, మేజర్” సినిమాలు దగ్గర పెట్టుకుని ఆ షేడ్స్ రాకుండా, రెండు సినిమాలకు భిన్నంగా హీరోయిన్ పాయింటాఫ్ వ్యూలో కథను నడిపమే ఈ సినిమా కొత్తదనం.ముఖ్యంగా డైరక్టర్ డిపెండ్ అయ్యింది... ఫ్యామిలీ ఎమోషన్స్ మీద. సాధ్యమైన మేరకు కంటెంట్ లో ఉండే గాంభీరతను తగ్గించటానికి దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి (Rajkumar Periasamy)అక్కడక్కడా హాస్యాన్ని ఎంచుకున్నాడు.
అంతకు మించి ఎమోషన్స్ ను కథలో భాగం చేసి స్క్రిప్టు రాసుకున్నారు. అయితే ఆ క్రమంలో సినిమా కమర్షియల్ డ్రామాగా మారిందనేది నిజం. అయితే ఎవరి భయాలు వాళ్లకుంటాయి. కాబట్టి అటు వైపు మాట్లాడేందుకు ఏమీలేదు. అలా కాకుండా చేస్తే క్లాసిక్ అయ్యేదేమో కానీ అన్ని వర్గాలను చేరకపోకపోను అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఎమోషన్స్ లో పీక్స్ కు వెళ్లింది. అదే కలిసి వచ్చింది.
ఎవరెలా చేసారు
ఇది పూర్తిగా సాయి పల్లవి చిత్రం. తెరపై శివకార్తికేయన్ సీన్స్ ఎక్కువ కనిపించినా, స్పైస్ మొత్తం సాయి పల్లవి లాగేసుకుంది. తన నటనతో రెబెక్కా వర్గీస్ పాత్రకు ప్రాణం పోసింది. ఇంకొకరు ఈ పాత్రను చేస్తే ఈ స్దాయిలో అయితే చేయలేరు అనేంతగా జీవించింది.
శివకార్తికేయన్ ఈ పాత్ర కోసం పడిన కష్టం,తాపత్రయం, బాడీ లాంగ్వేజ్ ఆశ్చర్యపరుస్తాయి. ఇన్నాళ్లూ కామెడీకే పరిమితమైన శివకార్తికేయన్ ఈ సినిమాతో నెక్ట్స్ లెవిల్ కు వెళ్లారు. ఆర్మీ చీఫ్ గా రాహుల్ బోస్ (Rahul Bose) ,సైనికుడిగా భువన్ అరోరా (Bhuvan Arora) గుర్తుండిపోతారు. తల్లి పాత్రలో గీతా కైలాసం కూడా మనం థియటర్ నుంచి బయిటకు వచ్చాక కూడా గుర్తుకు వస్తుంది.
అమరన్ టెక్నికల్ గా..
సి.హెచ్.సాయి (Ch Sai) సినిమాటోగ్రఫీ వర్క్ మంచి ఎక్సపీరియన్స్ ని ఇస్తుంది.జి.వి.ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) పాటలు ఓకే ఓకే అన్నట్లు ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా సీన్స్ ని గుర్తుండిపోయేలా చేసారు. అన్నిటికన్నా ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ అవసరం ఎంత అనేది ఎమోషన్ సీన్స్ లో అర్దమవుతుంది. కమల్ హాసన్ & సోనీ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. దాదాపు రియల్ లొకేషన్స్ సినిమాని తీసి నిండుతనం తెచ్చారు.
అమరన్ ఫైనల్ థాట్
ఆర్మీ సినిమాలు ,నేపధ్యాలు అన్ని వర్గాలకు ఎక్కేవి కావు. అయితే సాయి పల్లవి నటన కోసం ఈ సినిమాని చూడచ్చు. దేశభక్తి మేజర్ ఎలిమెంట్ అవటం, బయోగ్రఫీ కావటంతో ఓ వర్గానికి మల్టిప్లెక్స్ లకు నచ్చుతుంది. ఫ్యామిలీలకు నచ్చితేనే బి,సి సెంటర్లపై నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకా శివకార్తికేయన్ కు సెపరేట్ మార్కెట్ క్రియేట్ కాకపోవటంతో.
Rating:3
---సూర్య ప్రకాష్ జోశ్యుల