ఎవ్వడికీ భజన చేయాల్సిన అవసరం లేదు..శ్రీహరి వల్లే చిరంజీవి కొడుకు మూవీ ఇండస్ట్రీ హిట్టు, సంచలన రియాక్షన్

First Published | Oct 31, 2024, 2:52 PM IST

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రాంచరణ్ 'చిరుత' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చిరుత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కింది. సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో డ్యాన్స్, ఫైట్స్ విషయంలో రాంచరణ్ అభిమానులని ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. 

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రాంచరణ్ 'చిరుత' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చిరుత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కింది. సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో డ్యాన్స్, ఫైట్స్ విషయంలో రాంచరణ్ అభిమానులని ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. ఇక చిరంజీవి కొడుకు కాబట్టి అంతకి మించిన హిట్ కావాలి అని ఎదురుచూస్తున్న తరుణంలో సెకండ్ మూవీ రాజమౌళితో సెట్ అయింది. 

రాంచరణ్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన మగధీర చిత్రం అప్పటికి 80 ఏళ్ళ చరిత్ర కలిగిన టాలీవుడ్ రికార్డులని అన్నింటినీ తుడిచి పెట్టేస్తూ కనీసం కలలో కూడా ఊహించని విధంగా 75 కోట్ల వసూళ్లు సాధించింది. మగధీర ముందు వరకు టాలీవుడ్ చిత్రాల కలెక్షన్స్ రేంజ్ అత్యధికంగా 35, 40 కోట్ల మధ్యే ఉండేది. కానీ మగధీర ప్రభంజనం చూసి బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. దర్శకుడిగా రాజమౌళి క్రేజ్ ఊహించని విధంగా పెరిగిపోయింది. రాంచరణ్ పెర్ఫామెన్స్ కి ప్రశంసలు దక్కాయి. 


ఈ చిత్ర సక్సెస్ లో క్రెడిట్ విషయంలో చాలా రూమర్స్ వచ్చాయి. అంతా రాజమౌళి వల్లే అంటూ యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. లెజెండ్రీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు అయితే ఇంకాస్త ఘాటుగా కామెంట్స్ చేశారు. రాజమౌళి దర్శకత్వం, శ్రీహరి నటన లేకుంటే మగధీర చిత్రం లేదు. ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అయిందంటే వీళ్లిద్దరు మాత్రమే కారణం అని దాసరి అన్నారు. 

ఈ ప్రశ్న రాజమౌళికి ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. ఈ ప్రశ్నకి రాజమౌళి సంచలన రియాక్షన్ ఇచ్చారు. రాజమౌళి మాట్లాడుతూ.. ఆయన కామెంట్స్ తో నేను ఏకీభవించను. నేను అతి వినయం ప్రదర్శించను, నా గురించి ఎక్కువ ఊహించుకోను.. అలాగే తక్కువ చేసుకోను. మగధీర చిత్రం బాగా రావడానికి ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు.  నేను ఎంత కష్టపడినా, ఎంత చేసినా దర్శకుడి చేతుల్లో ఉండేది సినిమా బాగ తీయడం మాత్రమే. 

ఒకసారి ఆ చిత్రం థియేటర్స్ లోకి వెళ్లి రికార్డులు సృష్టించింది అంటే దానికి 80 శాతం కారణం స్టార్ కి ఉన్న ఇమేజ్. స్టార్ హీరోని చూసి ఎగబడి జనాలు చూడడం వల్లే రికార్డులు వస్తాయి. కాబట్టి కలెక్షన్స్ క్రెడిట్ స్టార్ హీరోలదే. కానీ సినిమా బాగ లేకపోతే దర్శకుడు కానీ, స్టార్ హీరో కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరు అని రాజమౌళి అన్నారు. మీరు లౌక్యం ప్రదర్శిస్తూ సమాధానం చెబుతున్నారా అని యాంకర్ ప్రశ్నించారు. రాజమౌళి స్పందిస్తూ లేదు నేను లౌక్యం ప్రదర్శించడం లేదు. నేను ఈ రేంజ్ కి వచ్చాక ఎవరికీ భజన చేయాల్సిన అవసరం లేదు. 

రాంచరణ్ అప్పటికి స్టార్ హీరో కాదు కదా అని యాంకర్ అన్నారు. లేదు.. ఫస్ట్ మూవీతోనే రాంచరణ్ కి స్టార్ స్టేటస్ వచ్చేసింది అని రాజమౌళి సమాధానం ఇచ్చారు. నేను, ఒక కమెడియన్ కలసి రోడ్డుపై వెళుతుంటే.. జనాలు కమెడియన్ వద్దకే వెళతారు. నటుడికి ఉండే శక్తి లాంటిది. ఒక కమెడియన్ కే అంత ఇమేజ్ ఉంటే.. చిరంజీవి కొడుకుకి ఇంకెంత ఇమేజ్ ఉంటుంది అని రాజమౌళి అన్నారు.

Latest Videos

click me!