ఇక ఇంటికి వచ్చిన సూరి కొట్టించుకోని ఇంటికి వస్తాడు.. ఎం జరిగింది అని దేవుడమ్మ, ఆదిత్య అడిగితే జరిగిన విషయం అంత రాజమ్మ చెప్తుంది. అది విన్న ఆదిత్య నువ్వు చూసింది నిజమే బాబాయ్ కానీ నీకు నిజం చెప్పలేను అని బాధ పడుతాడు. మరో సీన్ లో దేవి, చిన్మయి ఇద్దరు చదువుకుంటూ మాట్లాడుతుంటారు. అప్పుడే మాధవ వచ్చి ఎం చెప్పాలనుకుంటున్నావ్ దేవి అని అడుగుతాడు.