ముసలోళ్ళందరికీ పెళ్లి అవుతోంది.. నాకు కావడం లేదే.. నరేష్, పవిత్రపై సురేఖ వాణి సెటైర్

Published : May 27, 2023, 03:25 PM ISTUpdated : May 27, 2023, 03:50 PM IST

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు.

PREV
16
ముసలోళ్ళందరికీ పెళ్లి అవుతోంది.. నాకు కావడం లేదే.. నరేష్, పవిత్రపై సురేఖ వాణి సెటైర్

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. 

26

కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ ట్రోలింగ్ కి గురవుతుంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం జరుగుతూనే ఉంది. 

 

 

36
Surekha Vani

ఇదిలా ఉండగా సురేఖ వాణి తరచుగా గ్లామర్ రీల్స్ తో పాటు సెటైరికల్ రీల్స్ చేయడం, అవి వైరల్ కావడం చూస్తున్నాం. ఆ మధ్యన సురేఖ వాణి.. వైయస్ షర్మిల ని ట్రోల్ చేస్తూ పెట్టిన ఇంస్టాగ్రామ్ రీల్స్ పెద్ద దుమారమే రేపాయి. కొంతమంది షర్మిలపై చేసిన రీల్స్ ఫన్నీగా ఉన్నాయి అని కామెంట్ పెడితే.. మరికొంత మంది తిరిగి సురేఖ వాణిని ట్రోల్ చేశారు. 

46

అయితే తాజాగా సురేఖ వాణి మరో ఆసక్తికర వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సురేఖ వాణి నరేష్, పవిత్రలని.. రీసెంట్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న ఆశిష్ విద్యార్థిని ట్రోల్ చేస్తూ పోస్ట్ చేసింది. ముసలోళ్ళందరికి పెళ్లిళ్లు అవుతున్నాయి. నాకు కావడం లేదు ఏంటి అంటూ వాపోతున్నట్లు ఉంది. 

56

నరేష్, పవిత్రాల మళ్ళీ పెళ్లి చిత్రం నిన్ననే విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే 60 ఏళ్ల వయసులో ఆశిష్ విద్యార్థి కూడా రెండో వివాహం చేసుకున్నారు. వాళ్లందరికీ పెళ్లిళ్లు అవుతున్నాయి.. నాకు కావడం లేదు ఏంటి అని అర్థం వచ్చేలా సురేఖ వాణి పోస్ట్ చేసింది. 

 

66

సురేఖ వాణి భర్త ఆ మధ్యన మరణించారు. అప్పటి నుంచి సురేఖ వాణి సింగిల్ గా ఉంటోంది. మా అమ్మకి మళ్ళి పెళ్లి చేస్తానని సుప్రీతా ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సురేఖ వాణి రీసెంట్ పోస్ట్ చూస్తుంటే ఆమె కూడా సెకండ్ మ్యారేజ్ కోసం పరితపిస్తోంది అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories